Rbi may cut interest rate further

Reserve Bank of India, Economists, bankers, Reputation Policy review, Interest rate, RBI governer Raghuram rajan, Raghuram Rajan, repo rate, reverse repo rate, CRR

rbi may cut interest rate further in policy review headed by RBI governer raghuram rajan tomarrow

మళ్లీ తగ్గనున్న వడ్డీ రేట్లు..!

Posted: 02/02/2015 07:50 PM IST
Rbi may cut interest rate further

రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరింత ఊరటనివ్వనున్నారా? వడ్డీరేట్లు ఇంకా దిగిరానున్నాయా? అవుననే అంటున్నారు బ్యాంకింగ్ వర్గాలు, ఆర్థికవేత్తలు.రేపు(మంగళవారం) చేపట్టబోయే పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక పాలసీ వడ్డీరేటును మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందనేది వారి అంచనా.

ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం.. కోల్ ఇండియాలో వాటా విక్రయం విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో వృద్దికి చేయూతనిచ్చేందుకు ఆర్‌బీఐ మరోవిడత రేట్ల కోతకు ఓకే చెప్పొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గత నెలలో అనూహ్యంగా ఆర్‌బీఐ పాలసీ రేటు(రెపో)ను పావు శాతం తగ్గించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీంతో గడిచిన 20 నెలలుగా కొనసాగుతున్న కఠిన పాలసీకి బ్రేక్ పడినట్లయింది. రెపో రేటు ప్రస్తుతం 7.75%, రివర్స్ రెపో 6.75%, సీఆర్‌ఆర్ 4% వద్ద ఉన్నాయి.

కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5%కి తగ్గగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం సున్నా స్థాయిలోనే(0.1%) ఉంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ.22,557 కోట్లు లభించాయి. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.43,425 కోట్లలో ఇప్పటికే సగానికిపైగా ఖజానాకు చేరాయి. ఇంకా ఓఎన్‌జీసీ, ఐఓఎల్, భెల్, ఎన్‌ఎండీసీ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి పీఎస్‌యూలు వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో మార్చిలోగా ఈ లక్ష్యం సులువుగానే సాకారమయ్యే అవకాశాలు సుస్పష్టం.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అటు పారిశ్రామిక వర్గాలు ఆర్‌బీఐ మరింత రేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. గతనెలలో పావు శాతం తగ్గింపు చాలా తక్కువేనని కార్పొరేట్లు పేర్కొంటున్నారు.  ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐ విజయం సాధించిందని.. రానున్నరోజుల్లో వడ్డీరేట్లు ఇంకాస్త దిగొచ్చే అవకాశాలున్నాయంటూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reserve Bank of India  Policy review  Raghuram rajan  

Other Articles