Does BJP and Shiv Sena to tie-up again ‘మహా’లో మళ్లీ ముడిపడనున్న పాతమిత్రుల మైత్రిబంధం.?

Maharashtra does bjp and shiv sena to tie up again to form government

bjp mlas shiv sena, maha vikas aghadi, maharashtra legislative assembly, bjp mlas suspended, devendra fadnavis, bhaskar jadhav, shiv sena, bjp maharashtra, ashish shelar, maharashtra legislative assembly, PM Modi, Uddhav Thackery, Sharad pawar, Maharashtra Politics

In Maharshtra does the old friends BJP and Shiv sena tie-up again to form the government in collation, political analytists say it may happen any time ing second half of the 2021 or in the first half of 2022.

‘మహా’ పాతమిత్రుల మైత్రిబంధం మళ్లీ ముడిపడనుందా.?

Posted: 07/10/2021 08:19 PM IST
Maharashtra does bjp and shiv sena to tie up again to form government

మహారాష్ట్రలో పాత మిత్రులైన బీజేపీ, శివసేనలు మళ్లీ ఒక్కటి కానున్నాయా.? ఈ ఏడాదిలో ఈ రెండు పార్టీలు ఒక్కటై మరోమారు మహారాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్ నాథ్ అథావాలే ఈ మేరకు తన మనస్సులో అభిప్రాయాన్ని గత ఏడాది వెలిబుచ్చారా.? లేక కేంద్రం తలస్తున్న విషయాన్నే వెలిబుచ్చారా.? అన్న విషయాలు పక్కన బెడితే.. ఆ తరువాత శివషేనకు చెందిన నేత కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆ దిశగా సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే కూడా ప్రధాని నరేంద్రమోడీని కలసిన సందర్భంలో ప్రధానితో సమావేశంపై స్పందన గురించి అడిగిన మీడియాతో వెటకారంగానే మాట్లాడారు. తాను నవాజ్ షరీఫ్ తో మాట్లాడటానికి వెళ్లలేదని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య జరిగిన చర్చలు కూడా ఆ దిశగా ముందుకువెళ్లడానికి అడుగులు పడుతున్నాయా.? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలనపై ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందానికి బీజేపి బ్రేక్ చేసిందని అరోపించిన శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకోనగా.. అవకాశం చిక్కిన ప్రతీసారి శివసేనపై అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అనేక సందర్భాల్లో శివసేనను విమర్శించారు. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఈ రెండు పార్టీలు కలుస్తున్నాయన్న సంకేతాలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపి అగ్రనేత దేవేంద్ర ఫడ్నావిస్ మాట్లాడుతూ.. శివసేన తమకు ఎప్పుడూ శత్రువు కాదని అన్నారు. శివసేన తమకు మిత్రుడేనని ఆయన చెప్పారు. అయితే ఎవరిపైన అయితే గతంలో కలిసి పోరాడామో... ఇప్పుడు వారితోనే కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండదని... పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

మాజీ మిత్రులైన బీజేపీ, శివసేన మళ్లీ కలిసే అవకాశం ఉందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. న్సీపీకి చెందిన నేతలపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. విపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని శివసేన, ఎన్సీపీ వ్యాఖ్యానించాయి. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రాబోతున్నాయనే ప్రచారం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బీజేపీ, శివ‌సేన పార్టీలు శ‌త్రువులు కాద‌ని ఇటీవ‌ల మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ త‌న‌దైన రీతిలో స్పందించారు. తామేమీ భార‌త్‌-పాకిస్థాన్ లాంటి వాళ్లం కాద‌ని ఆయ‌న చెప్పారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌-కిర‌ణ్‌రావుల బంధం లాంటిదే త‌మ బంధం కూడా ఆయన వ్యాఖ్యానించారు. త‌మ రెండు పార్టీల రాజ‌కీయ మార్గాలు వేరైనా.. త‌మ మ‌ధ్య స్నేహ భావం ఎప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. బీజేపీ, శివ‌సేన పార్టీల అనుబంధం గురించి ఇటీవ‌ల దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను ఓ మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా తామేమీ శ‌త్రువులం కాద‌ని ఆయ‌న ముక్త‌స‌రి స‌మాధానం ఇచ్చారు. దీనిపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ను ప్ర‌శ్నించ‌గా పై వ్యాఖ్య‌లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  shiv sena  maha vikas aghadi  congress  NCP  sharad pawar  devendra fadnavis  PM Modi  Maharashtra  Politics  

Other Articles