TRS Lacks Leaders, who can Challenge Etela వలస నేతతోనే టీఆర్ఎస్ ఈటెలను ఎదుర్కోనుందా.?

Trs party lacks leaders who can challenge etela rajender in huzurabad

TPCC secretary Padi Kaushik Reddy, Padi Kaushik Reddy Madannapet Vijender, Padi Kaushik Reddy Audio call viral, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Huzurabad, TPCC secretary, KoushikReddy, Phone Call viral, Congress, Audio viral, Etela Rajender, CM KCR, TRS, KTR, Gangula Kamalakar, Harish Rao, Telangana, Politics

TRS party had not condemned the leaked Audio tapes of alleged Huzurabad Congress party in charge, TPCC secretary Padi Kaushik Reddy, in which he said that TRS party By-election ticket is conformed to him from the Huzurabad constituency. This show there is lack of leaders in TRS party who can Challenge Etela in Huzurabad.

వలస నేతతోనే టీఆర్ఎస్ ఈటెలను ఎదుర్కోనుందా.?

Posted: 07/12/2021 08:49 PM IST
Trs party lacks leaders who can challenge etela rajender in huzurabad

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ తన మంత్రి పదవితో పాటు శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌డంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వ‌ర‌లో ఉప‌ ఎన్నిక జ‌ర‌గనున్న విషయం తెలిసిందే. బీజేపిలో చేరిన ఈటెల మరోమారు తనను బలపర్చాలని, ఆశీర్వదించాలని కోరుతూ హుజూరాబాద్ ప్రజలను కోరుతూ ఇప్పటికే జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ లో బలమైన నేత కరువయ్యాడా.? అంటే ఔనని చెప్పక తప్పదు. ఈటెల రాజేందర్ ను ఎదుర్కోనే బలం, బలగం, అనుచరగణం మాత్రం హుజూరాబాద్ లో టీఆర్ఎష్ పార్టీలో ఏ నేతకు లేదు.

అయితే ఇక్కడ పోటీకి బలమైన నేత కావాలంటే ఒక నేతను తయారు చేయడం కష్టం కనుక.. ఇతర పార్టీలో బలమైన నేతను తమ పార్టీలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందా.? అంటే కూడా ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీకి చెందిన బలమైన నేతను తమ పార్టీలోకి చేర్చుకుని అతనికి టికెట్ ఇవ్వడం ద్వారా తమ పార్టీకి చెందిన క్యాడర్ తో పాటు ప్రత్యర్థి పార్టీకి చెందిన క్యాడర్ సమిష్టిగా పనిచేస్తే ఈటెలను హుజూరాబాద్ లో ఎదుర్కోవచ్చునని భారీ ప్రణాళికకు తెరవేసిందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈటెల వెళ్లిన బీజేపి నుంచి బలమైన నేతను తమ గూటికి లాగేందుకు ప్రయత్నాలు చేసినా లాభం లేదని భావించిన టీఆర్ఎస్.. ఈటెలను సమర్థవంతంగా ఎదుర్కోంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను ఎన్నుకుందా.? అంటే కూడా ఔనన్న సమాధానాలు వినబడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా వున్న పాడి కౌశిక్ రెడ్డిని ఎంచుకుని ఈటెలను ఢీకొనేందుకు ప్రణాళిక రచించిందా.? అంటే తాజాగా వెలుగు చూసిన కౌశిక్ రెడ్డి అడియో ఔననే చెబుతోంది. ఈటెలను ఎదుర్కోనే ధమ్ము, సత్తా వున్న నేత టీఆర్ఎస్ లో కరువయ్యాడు. దీంతో కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకుని ఇటు కాంగ్రెస్ క్యాడర్, అటు టీఆర్ఎస్ క్యాడర్ ను కలుపుకుని ఎన్నికలలో పనిచేయాలని వ్యూహాలు రచిస్తున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇక ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వున్న క్యాడర్ ను పక్కనెబెట్టి.. టీఆర్ఎస్ కు దూరంగా ఈటెలకు మద్దుతు ప్రకటిస్తున్న నేతలను టార్గెట్ చేసిన వ్యూహకర్తలు వారిని పార్టీలోకి ఆకర్షించేందుకు ఇప్పట్నించే వారిని ప్రలోభాలకు కూడా గురిచేయాలని యోచనలో వుందన్ని కౌశిక్ రెడ్డి మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే కార్యకర్తతో మాట్లాడుతూ చెప్పిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే, షెడ్యూలు విడుదల కాకుండానే అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందన్న ఈటెల అరోపణలకు ఈ వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి.

తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తాం.. రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ది చేశాం అని ప్రచారం చేసుకున్నా అధికార పార్టీ.. దమ్ము ధైర్యం వుంటే డబ్బులు పంచకుండా ఎన్నికల బరిలోకి దిగాలని.. అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని ఇప్పటికే ఈటెల రాజేందర్ సవాలు విసిరారు. అయితే బంగారు తెలుంగా, అభివృద్ది అన్న నినాదాలను బలంగా ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ మాత్రం డబ్బుతోనే ఎన్నికల క్షేత్రంలో సత్తా చాటాలని చూస్తుందా.? ధనం మూలమ్ ఇదం జగత్ అన్న నానుడికే ఓటు వేస్తుందా.? డబ్బు లేకపోతే డిపాజిట్లు కూడా రావని భావిస్తుందా.? అంటే ప్రస్తుత కౌశిక్ రెడ్డి మాట్టాడినట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆడియోలోని మాటల అర్థాలు మాత్రం అలానే వున్నాయని చెప్పక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles