కేంద్రంలోని బీజేపి ఒకప్పుడు సోషల్ మీడియాను విరివిగా వాడుకుని అందలాన్ని ఎక్కిందన్న విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలో వున్న యూపిఏ ప్రభుత్వంపై వ్యంగంగా పోస్టులు, వీడియోలు పెట్టి ప్రజలను అలోచింపజేసిన బీజేపి.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చేరువై ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టింది. పంద్రాగస్టును పురస్కరించుకుని ఎర్రకోటలో జాతీయ జెండాను అవిష్కరించిన ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని కూడా అప్పట్లో గుజరాజ్ ముఖ్యమంత్రి హోదాలో కోనసాగుతూ నరేంద్రమోడీ అక్షేపించారు. అది కూడా సోషల్ మీడియాలో దుమారం రేపింది.
అయితే ఇలాంటి దుమారమే ప్రస్తుతం తమ ప్రభుత్వానికి ఎక్కడ ఎసరు తీసుకువస్తుందోనని ముందస్తుగానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అప్రమత్తం అవుతుందా.? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేసే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందన్న వాదనలు వినిబడుతున్నాయి. జనవరి 26న జరిగిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ తరువాత వారిని అష్టదిగ్భంధనం చేసేలా రోడ్డలపై కాంక్రీట్ మేకులు, గోడలు అడ్డుగా కట్టి వారి వద్దకు కనీసం మీడియా కూడా వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు రైతుల దీక్షలపై ఏ జాతీయ పత్రికలో వెతికినా కనబడకుండా చేయడంలోనూ కేంద్ర సఫలీకృతమైందన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి.
అంతేకాదు మీడియా ప్రతినిధలు వారి వద్దకు వెళ్లినా ఆంక్షలను విధించారు. మీడియా ప్రతినిధులపై కేసులు బనాయించారు. రైతు సమస్యలంటే కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలా కేంద్ర బావించేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఎక్కడికక్కడ రైతులను అన్ని విధాలా అవమానపర్చేలా చర్యలు తీసుకున్నారన్న అరోపణలూ వున్నాయి. చలికాలంలో ప్రారంభమైన రైతులు దీక్షలు.. ఆరు నెలలు పూర్తి చేసుకుని.. మరో పక్షం రోజుల్లో ఏడు నెలలను పూర్తి చేసుకోనున్నా.. వారి సమస్యలపై కేంద్రం దృష్టి సారించడం లేదు. రైతుల దీక్షల అంశం ప్రారంభంలో దేశవ్యాప్తంగా సంచలనమైన సందర్భంలో కేంద్రమంత్రులు కాసింత హడావిడి చేసి.. చర్చలకు మేం సిద్దమే అని వెల్లడిస్తూ ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిన కేంద్రం.. నిజానికి చిత్తశుద్దితో వారి సమస్యల పరిష్కారానికి మాత్రం కృషి చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి,
ఇక కరోనా మహమ్మారి రెండు దశలు విజృంభించినా కంటికి కనబడని శత్రువుతో పోరాడేందుకు కూడా సిద్దమైన రైతాంగం.. తమతో కొన్ని నెలల ముందు వరకు చర్చలు జరిపిన కేంద్రమంత్రులే తమ మొర ఆలకించడం లేదని వాపోతోన్నారు. ఇక నిరాకారి అయిన కరోనా కూడా తమపై పగబట్టి కొందరు రైతులను పోట్టబెట్టుకున్నా.. రైతాంగం ఏమాత్రం అధైర్యపడక.. దీక్షస్థలిలో తమ దీక్షలను కోనసాగిస్తోంది. వీరి దీక్షలను, మొక్కవోని ధైర్యాన్ని చూసి తమ మద్దతు ప్రకటించిన పలువురు ప్రముఖలకు కూడా కేంద్ర షాకిచ్చింది. రైతుల దీక్షలకు మద్దతుగా ట్వీట్లు చేసిన నలుగురు ప్రముఖుల ఖాతాలను కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ట్విట్టర్ తొలగించింది. ట్వీట్లనే కాదు వీరి ఖాతాలనే ఖతం చేసింది.
రైతు ఉద్యమంపై ట్వీట్లు చేస్తూ ప్రముఖులు అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రభుత్వ సూచనతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ నిలిపివేసిన ఖాతాల్లో పంజాబ్ కు చెందిన ప్రముఖ ర్యాప్ సింగర్ జస్విందర్ సింగ్ బైన్స్ (కెనడా), హిప్ హాప్ కళాకారుడు సుఖ్దీప్ సింగ్ భోగల్ (ఆస్ట్రేలియా) సహా మరో ఇద్దరి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. పంజాబ్ లో పుట్టి కెనడాలో పెరిగిన జస్విందర్ సింగ్ ‘క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ భాంగ్రా’గా పేరుకెక్కారు. ‘ఘగియన్ దా జొర్రా’, ‘హుస్నా ది సర్కార్’ వంటి పాటలు ఆయనకు విశేష ఆదరణ తెచ్చిపెట్టాయి. జస్విందర్, సుఖ్దీప్ సింగ్ ఇద్దరూ రైతు ఉద్యమానికి మద్దతుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఉద్యమం సందర్భంగా సంభవించిన మరణాలపై వీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనతో వీరి ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది.
(And get your daily news straight to your inbox)
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్‌లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more