panchkarla likely to join ruling YSRCP party.? టీడీపికి షాక్.. వైసీపి తీర్థం పుచ్చుకోనున్న పంచకర్ల.?

Visakha tdp leader panchkarla likely to join ruling ysrcp party

Panchkarla Rameshbabu, Panchkarla Rameshbabu to join YSRCP, TDP shocker, panchkarla to join YCP, TDP, YSRCP, Panchkarla Rameshbabu, Visakhapatnam District, Andhra Pradesh, Politics

Rumours doing rounds in Andhra Pradesh Political circles that TDP former MLA Panchkarla Ramesh Babu likely to Join ruling party YSRCP, This rumours came out after the visakha leader met swami swaroopanandendra saraswati .

టీడీపికి షాక్.. వైసీపి తీర్థం పుచ్చుకోనున్న పంచకర్ల.?

Posted: 09/26/2019 06:32 PM IST
Visakha tdp leader panchkarla likely to join ruling ysrcp party

విశాఖ జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్‌ నేత పార్టీ వీడేందుకు రంగం సిద్ధమయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్టుపై పోటీ చేసి ఓటమిపాలైన పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో టచ్‌లో ఉంటూ పార్టీ మారేందుకు మంతనాలు జరిపినట్టు సమాచారం.

ఇక అధికార పార్టీ నుంచి  ఆకుపచ్చ సంకేతాలు రావడంతో ఇక చేరికకు కూడా ఆయన ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  తన విజయానికి ఇక తిరుగు వుండకూడదని ఏకంగా విజయ దశమికి వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రమేష్‌బాబు చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో 2009లో రాజకీయ ప్రవేశం చేసిన పంచకర్ల ఆ ఎన్నిల్లో పెందుర్తి నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్‌ నాయకుడిగా మారారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో యలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. పార్టీ రూరల్‌ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి టీడీపీ టికెట్టు ఆశించినా అధిష్ఠానం గంటాకు ఆ స్థానం కేటాయించడంతో యలమంచిలి నుంచే పోటీ చేయక తప్పలేదు. అయితే కన్నబాబురాజు చేతిలో ఓడిపోయారు. అప్పటి  నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పంచకర్లకు పేరుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  Panchkarla Rameshbabu  Visakhapatnam District  Andhra Pradesh  Politics  

Other Articles

 • Does pm back door comments reiterates bjp in goa

  ఇవాళ కర్ణాటక, రేపు మహారాష్ట్ర.. మరీ గోవా..?

  Dec 09 | కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో దేశంలోని జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రభావంపై చూపనుందా.? అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుస్తిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని... Read more

 • Ycp political wing is breaking their head to tackle pawan kalyan all their efforts are failing

  పవన్ కల్యాణ్ ను కట్టడి చేసేందుకు వైసీపీ మేధోమధనం.?

  Nov 16 | ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి కన్నా జనసేన నుంచే ఎక్కువగా విమర్శలు ఎదురవుతున్నాయి. పైపైన వాటిని తమ నేతల ప్రతివిమర్శలతో కౌంటర్ ఇప్పిస్తూన్నా.. లోలోన మాత్రం జనసేనను... Read more

 • Former chief secretary lv subramanyam transferred due to tatikonda sridevi

  ఎమ్మెల్యేపై నివేదికే ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎసరు తెచ్చిందా.?

  Nov 06 | రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఏరి కొరి తెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం పదవి నుంచి ఆకస్మికంగా బదిలీకీ గురికావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్)... Read more

 • Mistry behind burning woman tashlidar alive is it a sketch

  తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ‘రియల్’ హస్తాలు..?

  Nov 05 | హైదరాబాద్ నగరశివారుల్లోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం వెనుక రియల్ హస్తాలు వున్నట్లు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కు చెందిన పెద్దలు వెనుకగా వ్యవహరిస్తూ.. అమెపై దారుణ చర్యలకు పాల్పడేలా చేశారా.?... Read more

 • Who will be andhra pradesh new pcc president

  రాష్ట్ర ‘చే’పగ్గాలు.. కాపునేతకా.. దళిత నేతకా..?

  Oct 25 | తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తమతోనే సాధ్యమైందని టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలు ఇప్పటికీ కాలర్ ఎగురవేస్తుంటాయి. అందుకు అన్ని పార్టీలు కారణమైనా అధికారంలో వుంటూ ఆ... Read more

Today on Telugu Wishesh