jagga reddy likely to join TRS.? కారెక్కేందుకు సిద్దమవుతున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.?

Senior congress mla jagga reddy likely to join trs

jagga reddy likely to join TRS, jagga reddy talks with harish rao, finance minister Harish rao, sangareddy mla harish rao, jaya prakash reddy, sangareddy, medak, Congress, TRS, Telangana, politics

Rumours in political circles doing rounds that Congress Senior MLA Jaya prakash Reddy likely to join TRS soon, after holding talks with Finance Minister Harish Rao

కారెక్కేందుకు సిద్దమవుతున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.?

Posted: 09/26/2019 08:25 PM IST
Senior congress mla jagga reddy likely to join trs

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. అధికార పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆయన మేనల్లుడు హరీష్ రావుపై కూడా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేసిన నేత ఆయన. మరో విధంగా చెప్పాంటే ఆయన మరెవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్ నేత జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటేనే అంతెత్తున ఎగిరిపడ్డ జగ్గారెడ్డి... రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన వాణిలో వేడి తగ్గింది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ అకర్ష్ లో భాగంగా మాజీ మంత్రులు సబితారెడ్డి, గండ్ర వెంకట్రామిరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో తనకు కారెక్కే అవకాశాలు వస్తున్నాయని అయితే తాను గులాబి కండువా కప్పుకునే విషయమై కొంత సమయం తరువాత క్లారిటీ ఇస్తానని చెప్పారు. అంతేకాదు అటు హరీష్ రావుపైనా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పలు సూచనలు చేశారు.

ఆ తరువాత తాను ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లలనని కూడా స్పష్టతనిచ్చారు. ఇక జగ్గారెడ్డి తమ పార్టీని వీడరని కాంగ్రెస్ నేతలు గుండెపై చేయివేసుకున్న వేళ.. జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించే అధికార పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుకు రెండో క్యాబినెట్ విస్తరణలో భాగంగా అర్థిక మంత్రిత్వశాఖ హోదా రాగానే అధికార పార్టీపై జగ్గారెడ్డి తన స్వరాన్ని సవరించుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించబోనని తెలిపిన జగ్గారెడ్డితో హరీష్ రావు అరగంట పాటు చర్చలు జరిపారు.

అంతే అప్పటి వరకు ఉప్పు నిప్పులా వున్న  పరిస్థితి కాస్తా.. మారిపోయింది. దీంతో ఇక జగ్గారెడ్డి తాజాగా హరీశ్ రావుతో కలిసి అభివృద్ధి పాట పాడటం.. మంత్రి హోదాలో సంగారెడ్డికి వచ్చిన ఆయనతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు హరీశ్ రావుకు ఆత్మీయ సన్మానం చేసిన జగ్గారెడ్డి... అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా ? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో మొదలైంది.

కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్న టీఆర్ఎస్... జగ్గారెడ్డిని చేర్చుకోవడానికి మాత్రం ముందుకు రాలేదు. ఇందుకు అసలు కారణం ఆయన హరీశ్ రావును విమర్శించడమే అనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన హరీశ్ రావుతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో... జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. మరి...హరీశ్ రావుతో ఆత్మీయ సన్మానం చేసిన జగ్గారెడ్డి... ఇప్పటికైనా కారెక్కుతారా లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  harish rao  jaya prakash reddy  sangareddy  medak  Congress  TRS  Telangana  politics  

Other Articles