TRS plans to contest in Maharashtra elections కమలానికి ‘మహా’ షాకిచ్చేందుకు కేసీఆర్ ప్లాన్.?

Trs shock bjp plans to contest in maharashtra elections

Kcr targets bjp, cm kcr, bjp, trs, Maharashtra, nanded, amit shah, pm modi, Maharashtra assembly elections

Telangana ruling party TRS likely to contest in Maharashtra Assembly Elections in old hyderabad state regions now parts of maharashtra.

కమలానికి ‘మహా’ షాకిచ్చేందుకు కేసీఆర్ ప్లాన్.?

Posted: 09/18/2019 08:54 PM IST
Trs shock bjp plans to contest in maharashtra elections

తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రూపంలో కొత్త సవాల్ ఎదురైందనే విషయం తెలిసిందే. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న తరువాత... బీజేపీ గేమ్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. గట్టిగా పోరాడితే తెలంగాణలోనూ తమకు అధికారం దక్కుతుందనే భావనలో ఉన్న బీజేపీ... టీఆర్ఎస్ టార్గెట్‌గా తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టింది.

ఈ కారణంగానే ఒకప్పుడు ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగించిన గులాబి బాస్ ఆయనకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో తనను ఇబ్బందిపెడుతున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేశారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. బీజేపీకి ఎంతో కీలకమైన రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తామని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు కేసీఆర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని లేకపోతే అక్కడ టీఆర్ఎస్‌ తరపున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆ నేతలు కేసీఆర్‌ను కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు గులాబీ బాస్‌ కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం. అయితే మహారాష్ట్ర ప్రాంత నేతలు సీఎం కేసీఆర్‌ను కలవడం సహజంగానే జరిగిందా లేక ఇది టీఆర్ఎస్ గేమ్ ప్లాన్‌లో భాగమా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అక్కడ బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఈ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనా... మహారాష్టలో టీఆర్ఎస్ పోటీ అనేది బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ రాజకీయ వ్యూహమా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  cm kcr  bjp  Maharashtra  PM Modi  Amit Shah  politics  

Other Articles

 • Why ruling party activists obstruct oppositions from contesting elections

  బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

  Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more

 • Yes bank crisis center actions create tension in account holders

  యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

  Mar 07 | యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల... Read more

 • Constable sridhar reddy transfered for kicking father of deceased student

  కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

  Mar 07 | సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్... Read more

 • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

  రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

  Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

 • Ycp party pressurising megastar chiranjeevi to accept mp proposal

  మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్.. సుముఖతకు వైసీపీ ఒత్తిడి.?

  Feb 19 | రాష్ట్రంలో ఏకపక్ష మోజారిటీ సాధించినా.. విపక్షాల విమర్శలను అధికార వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటూనే వుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ తో ప్రారంభమైన వైసీపీ పాలన.. ఇసుక అక్రమాలు.. మూడు రాజధానులు,... Read more

Today on Telugu Wishesh