Amit Shah in dock for holding meeting at Dabolim airport తప్పును సమర్థించుకుంటారా.? చర్యలకు సిద్దమంటారా.?

Will amit shah bind over to illegal meeting at goa airport

Amit Shah, Goa, BJP, Dabolim airport, Goa International Airport, Manohar Parrikar, CISF, Congress, aires rodrigues, gross abuse of power, embarassing to civilians, politics

BJP president Amit Shah addressed a public meeting at the Goa airport complex, Evenafter a lawyer-activist has filed a complaint against them terming the meet as "gross abuse of power" government takes no action.

తప్పును సమర్థించుకుంటారా.? చర్యలకు సిద్దమంటారా.?

Posted: 07/04/2017 05:36 PM IST
Will amit shah bind over to illegal meeting at goa airport

అధికార దుర్వినియోగానికి ఇది మరో సాక్ష్యం. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నావల్ ఎయిర్ బేస్, ఢిపెన్స్ ఎస్టాబ్లిష్ మెంట్ల పరిధిలోకి వచ్చే గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకంగా పార్టీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇతరులెవరైనా వారి తరహాలోనే వ్యవహరించి వుంటే వారిపై మోయలేనన్ని కేసులు నమోదు చేసి.. వారు చేసింది చిన్న తప్పిందం కాదని కూడా నమ్మబలికేవారు. కట్టుదిట్టమైన భద్రతావలయంలో వుండాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయంలో.. నిత్యం నిఘానేత్రాల పర్యవేక్షణ మధ్య వుండే చోట ఎవరైనా మీటింగ్ లు పెడతారా..? అని ఎదురు ప్రశ్నించేవారు.

సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగజేస్తూ ఇలా సమావేశాన్ని నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించేవారు..? ఇదెక్కడి చోద్యం అంటూ గగ్గోలు పెట్టేవారు. అందుకనే వారిపై కేసులు నమోదు చేశామని, ఇలాంటి తప్పులు ఎవరు చేసినా వారు శిక్షార్హులేనన్న విషయాన్ని మరింతగా నొక్కి చెప్పేవారు. కానీ కుడితిలో పడిన ఎలుక మాదిరిగా అయ్యింది కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార పక్షం పరిస్థితి. ఎందుకంటే ఆ మీటింగ్ ను నిర్వహించింది వారే కాబట్టి. అయితే దీనిని విపక్షాలకన్నా ముందుగానే ఓ న్యాయవాది, సామాజిక కార్యకర్త ఎయిరెస్ రోడ్రిగ్స్ తీవ్రంగా పరిగణించారు.

అమిత్ షా తో పాటుగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, గోవా బీజేపి అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్, కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ లపై కూడా కేసు నమోదు చేయాలని రోడ్రిగ్స్.. గోవా చీఫ్ సెక్రటరీ, డీజీపీ, విమానయాన శాఖలను కోరారు. గోవాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సమావేశం నిర్వహించడం నిబంధనలు అతిక్రమించడమేనని ఆయన తన పిర్యాదులో పేర్కోన్నారు. అయితే ఈ పెద్దలందరూ తమకు ఈ విషయం తెలియదని తెలివిగా తప్పించుకునే అవకాశాలు కూడా వున్నాయని, అయినా వారిపై కేసులు నమోదు చేయాలని రోడ్రిగ్స్ కోరారు.

దీనిని తమకు అందించ్చిన అవకాశంగా తీసుకుంది గోవా కాంగ్రెస్‌. అమిత్ షాను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై విమానాశ్రయ డైరెక్టర్ ను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించగా, తాను అనుమతినివ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు కేటాయించిన సీటులో తనను కూర్చోనివ్వకుండా అక్కడి అధికారి అడ్డుకోండంతో కోపోద్రిక్తుడైన శివసేన ఎంపీపై ఏకంగా ట్రావెల్ బ్యాన్ విధించి.. ముప్పుతిప్పలు పెట్టిన విమానయానశాఖ.. అధికారపక్షానికి చెందిన నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఎందుకు స్పందించరన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

విపక్షాలతో పాటు తమను నిత్యం ఇబ్బందిపెట్టే మిత్రపక్షాలను సైతం విడువకుండా చిన్న అంశాన్ని గోరంత చేసి రంద్రాన్వేషణ చేసే అధికార పక్షం.. అమిత్ షా మీటింగ్ పై ఎందుకు నేరుగా స్పందించడం లేదు.? అసలు దీనిపై మాట మాత్రమైనా అమిత్ షా స్పందించడం లేదంటే అయన చేసింది తప్పు అన్న విషయాన్ని అంగీకరిస్తున్నట్లేనా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. అమిత్ సా సహా గోవాలోని అదికార పక్షం తప్పిందాన్ని అంగీకరిస్తారా..? లేక సమర్ధించుకుంటారా..? అలా అయితే వారు చెప్పే సూక్తులు అన్ని కేవలం ప్రజలకేనా..? ఇదేమి చోద్యం.. చెప్పేదోకటి, చేసేదోకటి అన్న విమర్శలకు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aires rodrigues  Amit Shah  Goa  BJP  Dabolim airport  Manohar Parrikar  Congress  politics  

Other Articles