Supreme Court to examine validity of TN trust vote ఫళని పాపం పండేనా..? నిలకడగా నిజం గెలిచేనా.?

Setback to cm palanisamy as supreme court agrees to examine tn trust vote

E K Palaniswami, Tamil Nadu cash-for-vote sting, Suprme court, February Tamil Nadu trust vote, O Panneerselvan, AIADMK, DMK, karunanidhi, stalin, political gossips

In more trouble for Tamil Nadu Chief Minister E K Palaniswami, the Supreme Court on Wednesday agreed to examine the alleged cash-for-vote sting case involving ruling AIADMK MLAs

ఫళని పాపం పండేనా..? నిలకడగా నిజం గెలిచేనా.?

Posted: 07/05/2017 03:08 PM IST
Setback to cm palanisamy as supreme court agrees to examine tn trust vote

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అధికారాన్ని కాపాడుకునే యత్నంలో చేయకూడని పనులు చేశారా..? అంటే అవుననే సమాధానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు గాను తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విశ్వాస పరీక్ష జరిగిన తీరు సక్రమంగా లేదని.. దీనిని రద్దు చేయాలని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించింది.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు సమ్మతిని ఇచ్చింది. ఈ క్రమంలో పళని స్వామి ప్రభుత్వం అధికారాన్ని కాపాడుకునే యత్నంలో చేసిన పాపపు పనులు తెరమీదకు వస్తాయా..? అన్న ప్రశ్న సర్వత్రా వినబడుతుంది. బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున బంగారం, డబ్బును పంచినట్టు ఇటీవలే ఓ స్టింగ్ ఆపరేషన్ కూడా వెలుగుచూడటంతో ఇక పళని స్వామి ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు వచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఇప్పటికే మూడు ముక్కలుగా చీలిపోయిన అధికార అన్నాడీఎంకే పార్టీలో పళనిస్వామి వర్గం.. ఆది నుంచి మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నుంచి అటు విమర్శలను, ఇటు అరోపణలనుఎదుర్కోంటునే వుంది. కాగా వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి అటు కేంద్రంలోని అగ్రనేతలు తెరవనుకగా సాగించిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పన్నీరు సెల్వం ఏకంగా పళనిస్వామిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర పర్యటన కూడా చేశారు. తన పర్యటనలో అమ్మకు అసలైన వారసుడిని తానేనంటూ ప్రజల్లోకి వెళ్లారు.

అయితే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని.. పళనిస్వామి సర్కార్ ను గద్దె దింపితే.. మళ్లీ ఎన్నికలు వస్తాయని ఈ క్రమంలో తాము అధికారంలోకి ఎలాంటి ప్రయాస లేకుండా రావచ్చని భావిస్తుంది. దీంతో స్టింగ్ అపరేషన్ వెలుగుచూడగానే పళిని స్వామి ప్రభుత్వంపై ఏకంగా న్యాయపోరాటానికి సిద్దమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేసింది.

పళనిస్వామి అధికారాన్ని కాపాడుకునే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని, నిజానిజాలను న్యాయస్థానం విచారణలో వెలుగులోకి తీసుకురావాలని పిటీషన్లో పేర్కోన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 4 కోట్లు ఇచ్చేందుకు కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సిద్ధపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా తాజాగా న్యాయస్థానం తమిళనాడులో విశ్వాస పరీక్ష నిర్వహించిన క్రమాన్ని పరిశీలించేందుకు అనుమతిని ఇవ్వడంతో.. త్వరలోనే నిజాలు వెలుగుచూస్తాయని అరవ రాష్ట్ర ప్రజలు, అమ్మ అభిమానులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : E K Palaniswami  cash-for-vote sting  Tamil Nadu trust vote  O Panneerselvan  AIADMK  DMK  

Other Articles