భారీగా తగ్గనున్న ప్రెటోల్, డీజిల్ ధరలు.. Dip in fuel charges expected as international crude oil prices decrease

Dip in fuel charges expected as international crude oil prices decrease

tax collection from levies on petrol, retail prices of fuel oil in India, parliament, petrol, diesel, fuel prices, crude oil prices, central excise duty, comptroller and auditor general, CAG, oil companies, indian market

The oil companies may consider a cut in oil prices as international crude oil rates crumbles

భారీగా తగ్గనున్న ప్రెటోల్, డీజిల్ ధరలు..?

Posted: 03/24/2017 05:43 PM IST
Dip in fuel charges expected as international crude oil prices decrease

వాహనదారులకు దేశీయ ఇంధన సంస్థలు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నాయా..? అంటే ఔను అన్న సంకేతాలే వినబడుతున్నాయి. కేంద్రంలోకి బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చన నాటి నుంచి అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు గణనీయంగా మారుతూ.. 180 డాలర్ల వరకు వెళ్లిన బ్యారెల్ చమురు ధర అమాంతంగా కిందకు దిగివచ్చింది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం తొలినాళ్లలో 50 నుంచి 60 రూపాయల మధ్య వున్న పెట్రోల్ ధరలు మళ్లీ కేంద్రం విధించిన పన్నుల భారం కారణంగా పైపైకి ఎగబాకాయి.

దీనికి తోడు అంతర్జాతీయంగా కూడా క్రూడ్ అయిల్ ధరలలో పెరుగుదల కూడా ఒకింత కారణమయ్యింది. అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో క్రూడాయిల్ ధర 50 డాలర్ల దిగువకు పడిపోయింది. దీంతో మన ఇంధన సంస్థలు కూడా భారీగా ధరలను తగ్గిస్తారన్న వార్తలు ఊపందుకున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో ఉత్పత్తి పెరుగుతుండటంతో, పతనమవుతున్న ధరలకు కళ్లెం వేయాలంటే, ఒపెక్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వుంది. కాగా, ప్రస్తుతం మేలో డెలివరీ అయ్యే బ్యారల్ క్రూడాయిల్ ధర 49.71 డాలర్లుగా ఉంది. గత ఏడాది నవంబర్ 30 తరువాత ముడి చమురు ధర ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ ప్రభావంతో భారత క్రూడ్ బాస్కెట్ ధర కూడా తగ్గనుండటంతో పెట్రోలు, డీజెల్ ధరలు కూడా భారీగానే తగ్గనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.

ఇకపోతూ ఇప్పటికే కేంద్రం గత రెండు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై విధిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీపై విమర్శలు వెలువుడుతున్నాయి. ఇందన ధరలు తక్కువ ధరలకు అందుబాటులో వుండాల్సి వున్నా.. కేంద్రం విధించిన పన్నుపోటు కారణంగానే వాటికి రెకకకటు వస్తున్నాయన్న విమర్శలు వున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా లీటర్ పెట్రోల్ 1.2 గా వున్న ఎక్సైజ్ డ్యూటీని 8.95 కు పెంచగా, లీటర్ డీజిల్ పై 1.46గా వున్న పన్నును 7.96 కు పెంచారని దీని ద్వారా ఏకంగా 1.99 లక్షల కోట్ల రూపాయల అదాయాన్ని రాబట్టరాని కాగ్ తన నివేదికలోనూ పేర్కోనింది. ఈ నేపథ్యంలో ఈ సారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : petrol  diesel  fuel prices  crude oil prices  central excise duty  oil companies  indian market  

Other Articles

 • N korea s kim jong un appears in public amid health rumours

  ప్రజల ముందుకొచ్చినా.. కిమ్ విషయంలో తెరపడని అనుమానాలు.?

  May 02 | ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతిపై ప్రపంచదేశాల మీడియాకు అనుమానాలు వీడటం లేదు. పలు దేశాల మీడియా ఆయన అరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణించాడంటూ ఓ వీడియో కూడా... Read more

 • Why ruling party activists obstruct oppositions from contesting elections

  బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

  Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more

 • Yes bank crisis center actions create tension in account holders

  యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

  Mar 07 | యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల... Read more

 • Constable sridhar reddy transfered for kicking father of deceased student

  కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

  Mar 07 | సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్... Read more

 • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

  రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

  Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

Today on Telugu Wishesh