బజారున పడి.. అరెస్టు చేయించి.. పరువు తీసుకున్నారా..? police filed case against prabha for posting UP CM pic on social media

Complaint filed against women s activist for posting objectionable pics of up cm

BJP, BJP Yuva Morcha, Prabha Belavangala, obscene photos, Yogi Adityanath, social media, UP CM's photo morphed into obscene pictures, Yogi Adityanath's photo's morphed, BJP Yuva Morcha Bangalore, activist Prabha Belavangala, Communist activist Prabha Belavangala

BYJM accused Prabha Belavangala as a 'habitual mischief and rumors monger' who had earlier tried to create social disharmony by publishing inflammatory content on Facebook.

బజారున పడి.. కేసులు పెట్టి.. పరువు తీసుకున్నారా..?

Posted: 03/22/2017 12:54 PM IST
Complaint filed against women s activist for posting objectionable pics of up cm

బీజేపి యువమోర్చ ఆ ముఖ్యమంత్రి పరువును తీసిందా..? దేశంలోనే అత్యంత కీలకమైన, అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన యోగీ అదిత్యనాథ్ విషయంలో బీజేపి యువమోర్చా నేతలు అత్యుత్సాహం పార్టీ పరువును బజారున పడేసిందా..? తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పరువును తీసుకున్నారా..? ఈ విషయంలో బీజేపీ యువమోర్చ నేతలు స్వయంకృతాపరార్థం వుందా..? లేక అనుకోకుండానే ప్రచారం పెరగడం.. పరువు మంటగలపడం జరిగిపోయాయా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

వామపక్షానికి చెందిన మహిళా నేత, మహిళా హక్కుల ఉద్యమకర్త ప్రభ ఎన్ బైలహొంగల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కు చెందిన అభ్యంతరకర ఫోటోలను తన ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో ఈ విషయమై బీజేపి యువమోర్చ నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అమె తమ ముఖ్యమంత్రికి చెందిన ఫోటో షాప్ చేసిన కల్పిత ఫోటోలను తన పేస్ బుక్ లో పెట్టి తప్పడు ప్రచారానికి తెర తీసారని బీజేపి నేతలు అరోపించారు. తక్షణం అమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపి యువమోర్చ నేతలు అమెపై పోలీసులకు కూడా పిర్యాదు చేశారు.

అమె సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో ప్రభ బైలంహొంగల పోస్టు చేసిన ఫోటోలలో.. ముఖ్యమంత్రి పదవి కన్నా ముందు అటు మఠాధిపతిగా ఇటు బీజేపి ఎంపీగా ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు చేరువైన ఆయన.. ఒక మహిళతో సన్నిహితంగా వున్నారంటూ..  వాటి తాలుకు ఫోటోలను తన పేస్ బుక్ పేజీపై అప్ లోడ్ చేశారు. దీంతో అమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాయచూరులోని సదర్ బజార్ పోలిస్ స్టేషన్ వద్ద కార్యకర్తలు అందోళనకు దిగి అమెపై పిర్యాదు చేశారు.

అయితే యోగి అదిత్యనాథ్ కు చెందిన అభ్యంతరకర పోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడంలో అవి నిజమేనా కాదా అంటూ పెద్ద సంఖ్యలో ఆ ఫోటోలను వీక్షించేందుకు నెట్ జనులు సర్చ్ చేసినట్లు సమాచారం. దీంతో యోగి అదిత్యనాథ్ పరువును పార్టీ నేతలే తీసారా..? అయన పరువును బజారు పాలు చేశారా..? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరికోందరు ప్రభ పోస్టు చేసిన ఫోటోలు నిజమైనవా..? కాదా..? అని విచారణ జరిపిన తరువాత అమెపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  BJP Yuva Morcha  Prabha Belavangala  obscene photos  Yogi Adityanath  social media  

Other Articles