అద్వానీ అధ్యక్ష ఆశలకు అడ్డుగా మోహన్ భగవత్..! Is Mohan Bhagwat a competitor to Advani's presidential dream

Is mohan bhagwat a competitor to advani s presidential dream

Rashtriya Swayamsewak Sangh, RSS chief Mohan Bhagwat, Mohan Bhagwat, RSS chief Mohan Bhagwat as President, Shiv Sena, Sanjay Raut, BJP, Presidential Elections 2017, Advani, President post, Hindu Rashtra India

Advani who has been sidelined after Modi become the Prime Minister was expected to be the presidential candidate, but now Shiv Sena proposing for RSS chief Bhagwat is a spoiler for Advani

అద్వానీ అధ్యక్ష ఆశలకు అడ్డుగా మోహన్ భగవత్..!

Posted: 03/28/2017 05:39 PM IST
Is mohan bhagwat a competitor to advani s presidential dream

దేశంలో ప్రస్తుతం బీజేపి ప్రభుత్వం అధికారంలో వున్నా అ పార్టీ కురువృద్దుడు, అగ్రగన్యుడు లాల్ కిషన్ అద్వానీకి మాత్రం క్యాబినెట్ లో స్థానం లేదు. కాదు కాదు.. క్యాబినెట్ లో స్థానం కల్పించలేదు. అగ్రనేతలు ఇలా అవమానిస్తారా..? అంటూ తొలినాళ్లలోనే అనేక ప్రశ్నలు, మోడీ ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. కేంద్రంలో తమ పార్టీకి వున్న మోజార్టీ సభ్యులను పరిగణలోకి తీసుకుంటే బీజేపికి అసలు ఒక్క మిత్రపక్షం మద్దతు కూడా అవసరం లేదు. కానీ పలు రాష్ట్రాల్లో తమతో చేయికలిపిన పార్టీలకు కేంద్ర క్యాబినెట్ లో స్థానం కల్పించి.. పార్టీకి పునాదులుగా పనిచేసి.. ఇంత పెద్ద పార్టీగా మలచిన అగ్రనేతలకు మాత్రం క్యాబినెట్లో స్థానం కల్పించరా..? అన్న విమర్శలు కూడా వచ్చాయి.

అయితే అగ్రనేతను క్యాబినెట్ నుంచి పక్కన బెట్టలేదని, ఆయన వయస్సు, గౌరవానికి సరితూగే సముచిత స్థానం ఇచ్చేందుకే తాత్కాలికంగా పక్కనబెట్టామని బీజేపి వర్గాలు పేర్కోన్నాయి. ఆ తరుణంలో కొందరు అద్వానీ అభిమానులు. పార్టీకి మూలస్థంబాలుగా వున్న పెద్దలు పార్టీ అంతర్గత సమావేశాలలో చర్చించగా అద్వానీకి రాష్ట్రపతి పదవిని కట్టబెట్టడానికే పక్కన బెట్టామన్న విషయం కూడా బయటకు వచ్చింది. దీంతో మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నకోవడం నుంచి ఆయనపై ఒంటికాలుపై లేచిన అద్వాని.. ఈ హామీ నేపథ్యంలో మౌనరాగాన్ని అలపిస్తువచ్చారు. ఇక త్వరలోనే ఆ సమయం అసన్నం అవుతుందన్న తరుణంలో ఇప్పుడు బీజేపి మిత్రపక్షం శివసేన మరో పేరును తెరపైకి తీసుకురావడంతో అద్వానీ అశలపై నీళ్లు చల్లనున్నారా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.

అయితే ఆయన ఎవరో సాధరణ వ్యక్తి అయితే అద్వానీ అంతగా పట్టించుకునేవారు కాదు. తాను పోటీలో వుంటానని తేల్చిచెప్పి మరీ ఎన్నికల బరిలో నిలిచేవారు. కానీ శివసేన ప్రతిపాదించింది ఏకంగా అర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరు కావడంతో ఆయన కూడా డైలిమాలో పడ్డారు. ఇన్నాళ్లు ఎవరైతే పార్టీ కోసం ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేశారో అయన పేరునే ప్రతిపాదించడంతో.. తాను గత మూడేళ్లుగా కలలుగంటున్న ఆశలను మోహన్ భాగవత్ అందుకుని పోనున్నారా..? తన కలలు తీరుతాయన్న తరుణంలో భగవత్ గద్దలా వచ్చి తన్నకుపోతారా..? అన్న అనుమానాలు అద్వానీ అభిమానుల్లో నెలకొన్నాయి.

కాగా, బీజేపిని ఇరుకున పెట్టేందుకే శివసేన అర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును తెరపైకి తీసుకువచ్చిందని, అంతేకానీ పార్టీ పరంగా ఎలాంటి పేర్లను. ప్రతిపాదనలు ఇప్పటి వరకు చర్చించలేదని బీజేపి వార్గాలు తెలుపాయి. అయితే బీజేపి కావాలనే శివసేన వర్గాలతో ఈ విధమైన వాదనను తెరపైకి తీసుకువచ్చాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అద్వానీని పూర్తిగా రాజకీయా నుంచి పక్కన బెట్టేందుకు బీజేపి వ్యూహాత్మకంగానే ఇలా శివసేనతో ప్రతిపాదనలు చేయించివుంటుందన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

అద్వానీ రాష్ట్రపతి పదవిలో కొనసాగినా.. తమ ప్రభుత్వం తీసుకునే బిల్లులు, అర్డినెన్సులకు అనుకూలంగా వ్యవహరిస్తారన్న నమ్మకం లేదని.. అందుచేతనే శివసేన ద్వారా ఈ ప్రతిపాదన తీసుకువచ్చి ఆ తరువాత.. బీజేపి పార్టీ అంతర్గత సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పేట్టుగా చేస్తారని, చివరకు ఎవరి పేరును ప్రతిపాదిస్తారన్నది కూడా తెరవెనుక అత్యంత గోప్యంగా నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే మోహన్ భగవత్ కావాలా..? లేక అద్వాని కావాలా..? అంటూ పార్టీ నేతల మధ్య ఓపినియన్ తీసుకుని ఆ తరువాత భగవత్ వైపుకు పార్టీ నేతలు మొగ్గేలా చర్యలు తీసుకుంటారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి పార్టీకి పునాదిగా వున్న నేతలకు గౌరవం లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Bhagwat  RSS  Shiv Sena  sanjay raut  BJP  Advani  President post  

Other Articles