కాంగ్రెస్ స్కెచ్ కి మాస్టర్ మైండ్ చిక్కుతాడా? | Prashant Kishor can join congress.

Prashant kishor to decide on joining congress

Prashant Kishor, Congress Prashant Kishor, Prashant Kishor Political Entry, Prashant Kishor Carrier, Prashant Kishor Success Record, Election Strategist Prashant Kishor, Election Strategist Congress, Indian Election Strategist, Congress Gujarat Election Prashant Kishor

The Election Strategist Prashant Kishor To Decide On Joining Congress Within 15 Days.

ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ లోకి??

Posted: 03/22/2017 10:49 AM IST
Prashant kishor to decide on joining congress

ఐదు రోజుల క్రితం లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఓ పోస్టర్ వెలిసింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పట్టిస్తే 5 లక్షలు ఇస్తామని ఆ పార్టీ కార్యకర్తలే అందులో పేర్కొన్నారు. మోదీ దగ్గరి నుంచి నితీశ్ దాకా అందిరికీ పని చేసిన ఆయన మ్యాజిక్ ఎందుకనో యూపీలో మాత్రం ఘోరంగా విఫలమైంది. దీంతో అసంతృప్తికి లోనైన కార్యకర్తలు ఆ పోస్టర్ ను వేశాడు. వెంటనే రంగంలోకి దిగిన సీనియర్లు అందుకు కారకులైన వారిని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏది ఏమైనా పంజాబ్ లో మాత్రం పీకే సూచనలు ఫుల్ గా వర్కవుట్ అయ్యాయంటూ కొత్త సీఎం అమరీందర్ సింగ్ ప్రశసించటం చూశాం.

అయితే యూపీ విషయంలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహత్మకంగానే వ్యవహరించినప్పటికీ కాంగ్రెస్ పెద్దలు చేసిన తప్పిదాలతోనే కేవలం 7 సీట్లు గెలిచి చారిత్రక ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ప్రియాంక ను సీన్ లోకి దించటం లాంటి అద్భుతమైన అస్త్రాన్ని హస్తం సరిగ్గా ఉపయోగించుకోకపోగా, రాజ్ బబ్బర్, గులాంనబీ ఆజాద్ లాంటి సీనియర్లు ప్రశాంత్ ను లైట్ తీస్కోవటం, అతితో ఎస్పీ పొత్తు లాంటి అంశాలు పెద్ద మైనస్ గా మారాయి.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ ను దూరం చేసుకునే ఆలోచనలోని కాంగ్రెస్ ఆయన్ని పర్మినెంట్ గా పార్టీలోకి లాగలనే స్కెచ్ వేస్తోంది. నిజానికి పొలిటికల్ ఎంట్రీ ఆలోచన తన మైండ్ లో లేదని ప్రశాంత్ పలు ఇంటర్వ్యూలలో చెప్పటం చూశాం. కానీ, రానున్న రోజుల్లో ఉనికి కూడా కోల్పోవటం ఇష్టం లేని కాంగ్రెస్ ఆయన స్ట్రాటజీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. ఓవైపు ఆప్ క్రేజ్ ను తొక్కేసి మరీ పంజాబ్ లో గ్రాండ్ విక్టరీ ని సాధించటం, గతంలో ఆయన సాధించిన ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుని ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తోంది. భవిష్యత్తులో పూర్తి స్వేచ్ఛ ఇస్తామన్న కండిషన్ కు ఒప్పుకోవటంతో పీకే కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడా?.. పదిహేను రోజుల్లో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election Strategist  Prashant Kishor  Congress Party  

Other Articles