will CM Chandra babu quit for rishiteswari suicide case in nagarjuna university

Somireddy do you implement your words

somireddy.. do you implement your words, CM Chandra babu, rishiteswari suicide case, nagarjuna university, Congress activist mmolate self for AP special status, man set afire, muni koti, ke krishna moorthy, somireddy chandramohan reddy, Tirupati, Congress Activist set afire, Special Status for AP, Man sets himself ablaze, Congress-sponsered protest, Tirupati, youth commits suicide, muni koti, AP congress meet, Tirupati

questions araise in the wake of suicide case of muni koti, opposition parties asle will CM Chandra babu quit for rishiteswari suicide case in nagarjuna university

మీ వ్యాఖ్యాలను మీరైనా అమలుపరుస్తారా..? సోమిరెడ్డి

Posted: 08/09/2015 04:28 PM IST
Somireddy do you implement your words

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన పోరుసభలో మునికోటి అనే యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించిన అంశం చర్చనీయంశంగా మారుతోంది. ఆయన చేసిన  వ్యాఖ్యాలను తమ పార్టీలో అమలుపరుస్తారా..? లేక కేవలం విమర్శలకే పరిమితం అవుతారా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. తిరుపతిలో యువకుడి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమన్న ఆయన.. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో విపక్షాలు ఆయనపై ప్రశ్నలను కురిపించేందుకు సిద్దమవుతున్నాయి.  

ఏపీ పిసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి పనికిరారని తిరుపతి ఘటన రుజువు చేస్తుందని, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం దీనిని స్పష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే విపక్షాలు కూడా అదే స్థాయిలో ప్రశ్నలను సంధించడానికి సిద్దమవుతున్నాయి. నాగార్జునా విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు.. టీడీపీ అధినేత, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి ఘటనకు భాద్యత వహిస్తూ పీసీసీ చీఫ్‌ పదవికి రఘువీరా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన పోమిరెడ్డి రాజమండ్రిలో తోక్కిసలాట ఘటనలో 36 మంది మరణానికి కారణమైన చంద్రబాబును ముందుగా రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muni koti  somireddy chandramohan reddy  Rishiteswari  Nagarjuna University  

Other Articles