revanth reddy lashes out on minister lakshma reddy

Revanth reddy once again takes a dig on telangana government

cash on vote, revanth reddy, minister lakshma reddy, doctor, Telangana government, kodangal, cash for vote, cherlapally central jail, bail, muthaiah jerusalem, chandra babu,acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sunita reddy, geeta reddy, horse riding

Telangana TDP leader revanth reddy once again takes a dig on Telangana government, lashes out on minister lakshma reddy

అవినీతి దత్తాపుత్రుని నోట నీతి వ్యాఖ్యలా..?

Posted: 08/09/2015 04:26 PM IST
Revanth reddy once again takes a dig on telangana government

అవినీతికి కేరాఫ్ అడ్రస్.. అడ్డంగా దోరికినా బుకాయింపు.. కింద పడ్డా, మీద పడ్డా నాదే పైచేయి అనే రకం.. స్వయంగా ఏసీబి అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా దోరికినా.. పశ్చాతాపం ఏ కోశాన లేదు.. అంతేకాదు.. సీన్ ముగియకుందే మీసాలు మెలయేడం, తొడలు కోట్టడం.. సవాళ్లు విసరడం, అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడటం అన్ని చేశారు. తన ఒంట్లో నరనరాన ప్రవహిస్తున్న రక్తంలో అసలు నీతికే తావులేదని చాటి చెప్పిన ఘటన అది. తాను ప్రజాప్రతినిధినన్న విషయాన్ని మర్చి.. కేవలం అధికార ప్రభుత్వంపై విమర్శలకు పాల్పడటమే తన ఏకైక ఎజెండాగా పెట్టుకున్న నేత వైఖరి అది. ఇదంతా ఎవరి కోసం చెబుతున్నామో తెలుసుకదా..? తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఐదు కోట్ల రూపాయాలు ఇస్తామని, ఆయన తమ పార్టీకీ ఓటు వేసేలా ఒప్పందం కుదుర్చుకుని 50 లక్షల రూపాయలను అడ్వాన్ గా ఇచ్చి,.. ఏసీబి అధికారులకు దోరికిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.

ఇన్నాళ్లు తన నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ పార్టీ కక్ష కట్టిందని, అభివృద్ది పనులు చేయడం లేదని అరోపించిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు సత్యదూరమని రుజువు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఓ అధికార కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... కమీషన్ల కోసం ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను చేపట్టుతుందని కొంతమంది నేతలు మంత్రులపై, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని అది సరికాదని అన్నారు. కమీషన్ల ప్రభుత్వమే అయితే ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు కట్టబెట్టలేదా. అని ప్రశ్నించారు. తాను మున్నాబాయి సినిమాలో డాక్టర్‌నని అరోపించాన వారు తాను డాక్టర్ గా చేసిన గుల్బర్గాలో విచారణ చేసుకోవచ్చునన్నారు. ఆరోపణలు చేసినవారు ఏం చదివారో బయటపెట్టాలని ఆయన నిలదీశారు.

ఇంతవరకు బాగానే వున్నా వేదికపైనే వున్న ఎమ్మెల్యే రేవంత్.. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమావేశం కాదు, అధికారిక సమావేశమన్న అంటూ వేధికపైనున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలుపారు. అంతటితో ఆగకుండా కేసీఆర్ టీడీపీలో ఉండి పదవులు అనుభవించ లేదా, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల చరిత్రలన్నీ తెలుసునన్నారు.  టీఆర్ఎస్ నేతల చరిత్ర తెలిసే.. ఆ నాడు ఎమ్మెల్యే టిక్కెట్టు కావాలని కేసీఆర్ కాళ్లవేళ్లా పడ్డారా..? ఆయన టిక్కెట్ ఇవ్వకపోవడంతో.. ఆయనపై పీకలదాక ప్రతీకారం పెంచుకుని.. ఆయనను టార్గెట్ చేస్తున్నారా..? ఆయన ప్రభుత్వానికి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చూశారా..? టీఆర్ఎస్ గెలిచిన సీట్ల సంఖ్య ఎంత..? ఇప్పుడున్న సీట్ల సంఖ్య ఎంత అంటూ నిలదీస్తున్నారు.. ఆయన అదే సీట్ల సంఖ్యతో వుంటే ప్రభుత్వానే కూల్చేందుకు మీరు యత్నించేవారు కాదా..? అన్న ప్రశ్నలు తెలంగాణ వాదుల నుంచి ఎదురవుతున్నాయి.

అటు మీ పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా మీరు ఇదే హితబోధ చేయాలని మరికోందరు తెలంగాణ వాదులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవకాశం దోరికిందే తడవుగా, అధికార కార్యక్రమమా..? అనదికార కార్యక్రమమా..? అన్న వ్యత్యాసమే లేకుండా.. అటుకాంగ్రెస్, ఇటు వైసిపీ సహా అన్ని విపక్షాలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారని మరి వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ అన్యాయం చేసిందని అరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు.. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయడం లేదా..? అంటే తెలంగాణ ఇవ్వడం ఆయనకు ఇష్టంలేకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికోందరు తెలంగాణ వాదులైతే.. ఇదే మహబూబ్ నగర్ పర్యటనలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుపై కూడా సిబిఐ విచారణ జరిపిస్తాం అని బహిరంగ సభలో చెప్పడంతో.. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. రాష్ట్ర పునర్విభజన కు సమ్మతిస్తున్నట్లు అంగీకరించి.. ఇక్కడకు వచ్చి..  నెపం కాంగ్రెస్ పైకి తోస్తున్నారని అరోపిస్తున్నారు. ఇవన్నీ వదలి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడం తగదని వారు హితవు పలుకుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash on vote  revanth reddy  minister lakshma reddy  doctor  Telangana government  kodangal  

Other Articles