T bill debate started in assembly

Telangana bill debate, Seemandhra leaders, telangana leaders, AP State Reorganisation Bill, N. Kiran Kumar Reddy, S. Raja Sadaram, MLAs, MLCs,

The bill was sent to the assembly by the President and it should not be..Telangana members seek an immediate debate on the bill.

తెలంగాణ బిల్లు పై అసెంబ్లీలో చర్చ మొదలయ్యిందా

Posted: 12/17/2013 09:58 AM IST
T bill debate started in assembly

కాంగ్రెస్ అధిష్టానం ఆఘ మేఘాల మీద రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన బిల్లు పై రాష్ట్రపతితో సంతకం చేయించి, రాష్ట్ర అసెంబ్లీకి పంపి 40 రోజుల్లో దీని పై చర్చించి తిరిగి పంపాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి నలభై రోజుల గడువు ఇస్తే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ నలభై రోజులు కాదు.. వారం పదిరోజుల్లో చర్చించి తిరిగి పంపాలని చెప్పి వెళ్లాడు.

డిగ్గీ రాజా చెప్పాడనో లేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి చర్చిస్తే ఓ పనైపోతుందని అనుకున్నాడో కానీ స్పీకర్ నిన్న (సోమవారం) అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు బిల్లు ప్రతులను ఇచ్చి, దాని పై చర్చకు ఇలా ఆదేశించాడో లేదో... అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నంత పని చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు ప్రతులను చించివేస్తే, మరికొంత మంది ఎమ్మెల్యేలు కాల్చివేశారు.

దీంతో రగడ తలెత్తి అసెంబ్లీ రణరంగంగా మారింది. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిని కింద పడేశారు, ఇంత జరిగాక అనూహ్యంగా మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమయ్యింది. సభ ప్రారంభమయిన వెంటనే చర్చకు అనుమతివ్వాలని డిప్యూటీ స్పీకర్‌ని కోరిన శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, చర్చ ప్రారంభమైనట్లే అని ప్రకటించేశారు. డిప్యూటీ స్పీకర్ చర్చ పై మాట్లాడిల్సిందిగా ప్రతిపక్ష నేతను కోరగా అక్కడ బాబు గారు లేక పోయే సరికి సభను నేటికి వాయిదా వేసి వెళ్లిపోయారు.

మరి బిల్లు పై చర్చ మొదలైందా ? కాలేదా ? అనే అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణ మంత్రులేమో చర్చ ప్రారంభమయ్యిందని ధీమాగా చెబుతున్నారు. సీమాంధ్ర మంత్రులు మాత్రం అబ్బే.. అదేం లేదంటున్నారు. శాసనసబలో చర్చ ప్రారంభం కానట్లేనని న్యాయశాఖ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి, చిన్న నీటివనరుల శాఖ మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చ ప్రారంభమైనట్లు కాదని సెలవిచ్చారు.

బీఏసీ సమావేశంలో నిర్ణయం జరగకుండా సభలో ముసాయిదా బిల్లుపై చర్చ ఎలా జరుగుతుందన్నది వారి వాదన. మొత్తమ్మీద బిల్లు పై చర్చ ప్రారంభం అయ్యిందో లేదో అంతా గందరగోళం నెలకొందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more