ఒకరు బాలనటుడిగా వెండితెర ప్రవేశం చేస్తే.. మరొకరు.. ఒకేసారి హీరోగా వెండితెరపై రంగ ప్రవేశం చేశారు. ఒక పవర్ స్టార్ . మరొకరు ప్రిన్స్ గా సినీ అభిమానులు మనసును గెలుసుకున్నారు గ. తంలో టాలీవుడ్‌లో నెం.1 ఎవరు అంటే టక్కున సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేవారు ఆ తరువాత ఆ స్థానాన్ని చిరంజీవి ఆక్రమించాడు. రెండు దశాబ్దాలకుపైగా మెగాస్టారే టాప్. ఇప్పుడు తెలుగు చలన చిత్ర సీమలో ఎవరు టాప్ అంటే... టకీమని చెప్పలేని పరిస్థితి. అయితే ఆ స్థానానికి ఎవరెవరు పోటీ పడుతున్నారంటే మాత్రం చటక్కున పవన్, మహేష్ పేరు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే టాప్ ఫైట్. టాలీవుడ్‌లో నెంబర్‌వన్ స్థానం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. వాళ్ళిద్దరూ టాప్ పొజిషన్‌కి పోటీ పడటమే కాదు... వారు నటించిన చిత్రాల విజయంలోనూ పోటీ పడ్డారు. పవన్ కల్యాణ్ హీరోగా 19 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. మహేష్ 1తో 19 సినిమాలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. పవన్‌కి గబ్బర్‌సింగ్ 2వ చిత్రం కాగా... మహేష్‌కి ఆగడు 20 సినిమా. గబ్బర్‌సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది చిత్రాలతో హ్యాట్రిక్ సాధించాడు పవన్. అలాగే మహేష్ దూకుడు, బిజినెస్‌మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు.
పవన్‌కల్యాణ్ నటించిన ఏడో సినిమా ‘ఖుషి’ అప్పటి వరకు అతని కెరీర్‌లోనే సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే మహేష్ నటించిన ఏడో సినిమా ‘ఒక్కడు’ కూడా బంపర్ హిట్. ఇప్పుడు వీరిద్దరు కూడా 20 సినిమాల మార్కును పూర్తి చేసుకోబోతున్నారు. పవన్‌కల్యాణ్‌కి 20వ సినిమా గబ్బర్‌సింగ్ 2 కాగా, మహేష్‌కి ఆగడుతో 20 సినిమాలు పూర్తవుతాయి. ఈ 20-20 సినిమాలు ఇద్దరి పొజిషన్‌ని ఖారారు చేస్తాయి అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. నెం.1 స్థానం ఈ రెండు సినిమాలే తేలుస్తాయి. ఎందుకంటే సినిమాల హిట్‌లో ఇద్దరూ సమానంగా ఉన్నారు.
పవన్‌కల్యాణ్ కెరీర్‌లో గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్‌సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, తాజాగా అత్తారింటికి దారేది లాంటివి పవన్ హిట్ చిత్రాలు.
మహేష్ కెరీరల్‌లో రాజకుమారుడు, మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్‌మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్‌లు ఉన్నాయి.
పవన్‌ఖాతాలో తొమ్మిది హిట్స్ ఉండగా... మహేష్ ఖాతాలో ఎనిమిది ఉన్నాయి. అయితే త్వరలోనే సంక్రాంతి కానుకగా 1(నేనొక్కడినే) విడుదలకానుంది. ఈ సినిమా హిట్ అయితే మహేష్ ఖాతాలో కూడా తొమ్మిది హిట్స్ అవుతాయి. ఇప్పటికే అత్తారింటికి దారేది చిత్రం హిట్‌తో పవన్ కల్యాణ్ టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. సంక్రాంతికి మహేష్ 1తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. . అయితే ఇప్పటి వరకు ఇద్దరూ ఒక్కో సినిమాకి రూ.18 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఇలా ఇద్దరూ టాలీవుడ్‌లో టాప్ పోజిషన్‌కోసం పోటీపడుతున్నారు. రాబోవు కాలంలో టాప్ పోజిషన్‌కోసం ఇద్దరి మధ్య ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.. అయితే ఒకరు రాజకీయల వైపు అడుగులు వేస్తున్నారు. మరొకరు బిజినేస్ పై ద్రుష్టి పెట్టారు. అయితే ఈ ఇద్దరు మాత్రం టాలీవుడ్ లో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more