రాయల తెలంగాణ ప్రతిపాదన దిశగా కాంగ్రెస్ శ్రేణులు అధినేత్రి సోనియాకు సూచించగా దానికి ఆమె నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని దానికి సంబంధించిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారని ఇలా రకరకాల వార్తలు వస్తున్నా ఇన్ని రోజుల నుండి సైలెంటుగా ఉంటున్న టీఆర్ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ దీని పై నోరు విప్పారు. రాయల తెలంగాణ అశం పై ఫామ్ హౌజ్ లో పార్టీనేతలతో సమావేశం అయ్యి చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అదిష్టానానికి హెచ్చరికలు పంపించారు. కాంగ్రెస్ అధిష్టానం ‘రాయల తెలంగాణ ’ అంటే మళ్ళీ రభస తప్పదని, అలా చేస్తే దానికి మేము అంగీకరించమని, గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువ పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఒక నాయకునికి టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ద్వారా ఈ హెచ్చరికను పంపినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ‘హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షల్లేకుండా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని అడుగుతున్నాం.
అంతకుమించి మరే ప్రతిపాదనా మాకు అంగీకారయోగ్యం కాదు. తెలంగాణకు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని మేం కోరుకోవడం లేదు. అలా చేస్తే రాష్ట్రాన్ని విభజించినట్టుగానే ఉంటుంది తప్ప తెలంగాణ వచ్చిందనే భావన తెలంగాణవాదులకు రాదు. తెలంగాణ కోసం రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఆలోచన కూడా మాకు లేదు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజల నుండి మరోసారి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
రాయల తెలంగాణ ప్రతిపాదన అధికారికంగా వస్తే ఉద్యమించడానికి సిద్ధం కావాలని, రాయల తెలంగాణ అనేది పుకార్లు మాత్రమే కావచ్చునని ఈ సంధర్భంగా కేసీఆర్ అన్నారు. ఇన్ని రోజులు సైలెంటుగా ఉన్న కేసీఆర్ మళ్ళీ ఉద్యమానికి సిద్దం పిలుపు నివ్వడంతో మళ్ళీ ఏం జరగబోతుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more