వివిధ దేశాల్లో ఉన్న సహజీవన సంస్క్రుతి మనదేశంలో కూడా గత కొంత కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా వాళ్ళలో ఈ సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్ షిప్) ఎక్కువగా కనిపిస్తుంటుంది. . ఇప్పటి వరకు మన దేశంలో ఈ సహజీవనానికి చట్టబద్దత లేదు. తనతో సహజీవనం గడిపిన వ్యక్తి నుంచి భరణం కోరుతూ ఒక మహిళ కోర్టును ఆశ్రయించిన కేసుపై తీర్పునిస్తూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సహజీవాన్ని గుర్తించి దానికి చట్టబద్దత కల్పించి సహజీవనం చేసిన మహిళలకు, వారి పిల్లల రక్షణ కోసం ఓ చట్టం రూపొందించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇలా వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం నేరమో, పాపమో కాదని కూడా స్పష్టం చేస్తూ ధర్మాసం తీర్పు నిచ్చింది. జస్టిస్ కేఎస్ రాధాక్రుష్ణన్ నేత్రుత్వంలోని ధర్మాసనం సహజీవనం మన దేశంలో సామాజికంగా ఆమోదం యోగ్యం కాకపోయినా అది నేరమో పాపమో కాదు... పెళ్లి చేసుకోవాలా, వద్దా అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనది తెలిపింది. అయితే ఈ చట్టం వివాహానికి ముందు శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని హెచ్చరించింది . ఎంతకాలంగా వారు కలిసి జీవిస్తున్నారు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి, పిల్లలు ఉన్నారా లేదా, సహజీవనం చేసే వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా బెంచ్ సూచించింది.
పాశ్చాత్య దేశాల మాదిరిగా సహజీవనాన్ని చట్టపరంగా గుర్తించడం సాధ్యమేనా, అలాంటప్పుడు వివాహ బంధానికి ఉన్న విలువ ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది విశ్లేషకుల నుండి. సుప్రీం కోర్టు తీర్పు పై మహిళా సంఘాలు, మత సంఘాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి. మన దేశంలో సహజీవనాన్ని చట్టబద్దతగా గుర్తించే దశకు వెళ్ళిందంటే మన సంస్ర్కుతి ఎటు వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more