బ్రహ్మచారి మోదీ పై ‘లేడీ ’ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశానికి కాబోయే ప్రధాని అని ఆ పార్టీ పెద్దలు నరేంద్ర మోడీని దేశ ప్రజలకు పరిచయం చేయటం జరిగింది. బీజేపి పార్టీ నుండి కాబోయే ప్రధాని అభ్యర్థి నరేంద్రమోది అని ప్రకటించిన నాటి నుండి.. మోడీ దేశం యాత్ర చేయటం మొదలు పెట్టారు. దేశంలో అన్ని ప్రధాన నగరంలో మోడీ స్వరం వినిపిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భలోనే మోడీ పై లేడీ మరకలు పడ్డాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే, మరోపక్క బ్రహ్మచర్యం పాటిస్తున్న నరేంద్ర మోడీ పై .. బెంగుళూర్ బెబీ తో అంటూ .. మోడీ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే రీసెంట్ గా గులైల్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ .. మోడీ మాట్లాడుతున్న ఒక లేడీతో ఆర్టికల్ ప్రచారం చేసింది. మోడీ బ్రహ్మచారి కాబట్టి మహిళలకు దూరంగా ఉంటారనే విషయం అందరికి తెలుసు. కానీ ఈ మహిళతో మోడీ ఎందుకు ఫోటో దిగారా? ఆమె మోడీ సరదాగా మాట్లాడారా ? అనేది మాత్రం తెలియాదు. ఆ మహిళ పేరు కూడా ప్రకటించింది. ఆమె పేరు ‘మాధురి’ అని ఆ వెబ్ సైట్ చెబుతుంది. అయితే 2005లో బెంగుళూరులో జరిగిన కచ్ శరద్ ఉత్సవాల సందర్భంగా గెస్ట్ కో ఆర్డినేటర్‌గా ఆమె వ్యవహరించినప్పటి ఫోటోని ప్రచురించింది. (ఆ ఉత్సవాలను ప్రారంభించేందుకు మోదీ బెంగుళూరు వెళ్లారు).
ఈ విషయం పై బీజేపి నాయకులు, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది కేవలం రాజకీయ నాయకుల కుట్ర అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రధాని పదవి రేసులో ఉన్న మోడీ పై ఇలాంటి మరకలు చల్లే ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి.. పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. మోడీ అభిమానులైతే.. మహిళతో మోడీ అని మేము ఓప్పుకోం అంటూ.. ఆందోళనలు చేయటానికి సిద్దంగా ఉన్నారు. దీనిపై పుల్ క్లారిటీ రావాలంటే.. మోడీ నోరు తెరిచి జరిగిన విషయం చెప్పాలి? లేదా ఆ మహిళ ఎవరో స్వయంగా రంగంలోకి దిగి, మోదీకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. అప్పుడు ఈ సమస్యకు తెరపడుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇలాంటి ఆరోపణలను నాయకుల పై రావటం సహజంగా జరుగుతాయి. కానీ వాటిని నిలబడి తన నిజాయితీని నిరుపించకున్న వాడే.. నిజమైన ప్రజల నాయకుడని మోడీ అభిమానులు అంటున్నారు. అయితే మోడీలో ఆ ధైర్యం, ఆ నిజాయితి, పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం పై సస్పెండయిన అధికారి ప్రదీప్ శర్మ - మోదీని వివాదంలోకి లాగాడు. ఓ మహిళపై మోదీ అక్రమ నిఘా పెట్టారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇంతకీ ఆ యువతి ఎవరు? మోడీ ఆమె పై పర్సనల్ కేర్ ఎందుకు తీసుకన్నాడు. ఆమె జీవితం పై నిఘా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more