Yellow journalism agonising artist life

yellow journalism, artist life disturbed, portals wrong news wrong photos, Married life marred yellow journalism

yellow journalism agonising artist life

కళాకారిణి జీవితంలో కలకలం రేపిన ఎల్లో జర్నలిజం

Posted: 10/08/2013 01:48 PM IST
Yellow journalism agonising artist life

సమాజంలో జర్నలిజం ప్రముఖమైన పాత్రనే పోషిస్తోందన్నది నిర్వివాదం.  ప్రపంచంలో జరుగుతున్న విషయాలను అందరి ముందుకు తెచ్చే గురుతర బాధ్యతను నెరవేరుస్తోంది.  కానీ అదే జర్నలిజంలో కలుపుమొక్కలుగా మొలిచే ఎల్లో జర్నలిజం అదే సమాజానికి చెడు కూడా చేస్తోంది.  నిరాధారమైన రాతల ద్వారా మరొకరికి హాని కలిగించి, కేవలం పత్రిక అమ్మకాలను పెంచుకోవటం ఉద్దేశ్యంగా వార్తలను సంచలన వార్తలుగా తీర్చిదిద్దటం కోసం తమ రచనా శక్తిని ఊహాశక్తిని ఉపయోగిస్తూ లేనివి జోడించి ప్రచురించటాన్ని ఎల్లో జర్నలిజం అంటారు. 

ప్రస్తుత కాలంలో వార్తా పత్రికలే కాకుండా వార్తలు సత్వరం అందరికీ అందటం కోసం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేరవేయటం జరుగుతోంది కాబట్టి దురదృష్ట వశాత్తూ ఎల్లో జర్నలిజం అందులో కూడా చోటు చేసుకుంది.  టివి ఛానెల్స్, ఇంటర్ నెట్ ని ఉపయోగించి చదవటానికి వెబ్ పోర్టల్స్ వార్తలను చాలా త్వరగా అందరికీ అందజేస్తున్నాయి.  కానీ అందులో తప్పులు దొర్లితే అవి కూడా అంతే త్వరగా అందరికీ చేరుతాయి. 

వెబ్ పోర్టల్స్ లో చాలా వరకు వాళ్ళ చిరునామాలు లేకపోవటం వలన పత్రికలకంటే నిర్భయంగా ఇష్టమొచ్చినట్లుగా రాసుకుంటూ పోయి, పుకార్లకే ప్రాధాన్యతనిచ్చి వాటికి మసాలా అద్ది చదివేవాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోతున్న ప్రబుద్ధులు కూడా సమాజంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. 

ఈ మధ్యకాలంలో ఒక చిన్నపాటి కళాకారిణి జీవితంలో జరిగిన అతి చిన్న సంఘటనను భూతద్దంలో చూపించి సమాజంలోని కుళ్ళునంతా బయటపెట్టే తమ బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా నెరవేర్చినట్లుగా భావిస్తూ పెద్ద నేరంలా చూపించారు కొందరు పోర్టల్స్ వాళ్ళు.

టివి ఛానెల్స్ లో కూడా వాళ్ళ ఛానెల్ ని చూసేవారి సంఖ్యను పెంచుకోవటం కోసం ఒక కళాకారిణికి ఒక వ్యాపారస్తునితో గల లైంగిక సంబంధాన్ని చాలా పెద్ద వార్తగా చూపించారు.  కళారంగంలో ముఖ్యంగా మహిళలకు ఎన్నో ఇబ్బందులుంటాయి.  ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతుంటాయి.  పని ఉన్నా లేకపోయినా కళాకారిణిగా వృత్తిలో వున్నంతకాలం వాళ్ళ శరీర సోయగాన్ని, ఆకర్షణను కాపాడుకుంటూవుండాలి,  తనను మర్చిపోకుండా ఉండటం కోసం ఆ వృత్తిలో జరిగే వేడుకలకు వెళ్తుండాలి.  వీటన్నిటికీ డబ్బు కావలసివుంటుంది.  ఒక్కోసారి ప్రముఖ వ్యక్తులతో చనువుగా కూడా ఉండవలసివస్తుంది. 

ఒకవేళ ఆపని తప్పు, సమాజంలో ఉన్న కుళ్ళు కాబట్టి బయట పెట్టాలి అనుకుంటే కళాకారులే ఎందుకు?  సమాజంలో కాలనీలలో జరుగుతున్న వ్యభిచారాన్ని పూర్తిగా బయటపెట్టటానికి కంకణం కట్టుకుని ఆ దిశగానే కృషి చెయ్యవచ్చుగా!  లేదు అలా చెయ్యరు!  ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కావలసింది సంచలన వార్త!  అది కళాకారులు, నలుగురికీ తెలిసినవారు, సెలబ్రిటీస్, లేదా రాజకీయ వేత్తల విషయంలోనయితేనే నలుగురి దృష్టినీ ఆకర్షిస్తుంది. 

ఇక న్యూస్ పోర్టల్స్ నడిపేవారు, వాళ్ళ పోర్టల్ కి ఎక్కువ హిట్స్ రావటం కోసం పోర్టల్ ని ఆకర్షణీయంగా తయారు చెయ్యటం కోసం అలాంటి వార్తలను గబగబా కాపీ పేస్ట్ చేసేస్తారు.  అందులో ఎంత నిజం ఉందన్న విషయం వాళ్ళకి పట్టదు. 

అంతేకాదు, పేస్ట్ చేసిన ఆ వార్తలు సరైనవేనన్న నమ్మకం కలిగించటం కోసం హడావిడిగా గూగుల్ లో ఫోటోలను వెతికి వాటిని పోర్టల్ లో పోస్ట్ చేసేసారు.  ఒకళ్ళను చూసి మరొకరు పరుగుపందెంలో వెనకబడిపోతామేమో అన్నట్టుగా వార్తలను, ఫోటోలను కాపీ పేస్ట్ లు చేసేసారు.  ఆ వార్తలు కానీ ఫొటోలు కానీ సరైనవేనా కాదా అని చూడకపోవటంతో ఆ ఫొటోలోని కళాకారిణికి సమాజంలో తలవంపులైంది.  వైవాహిక జీవితంలో పొరపచ్చలువచ్చాయి.  అందుకు బాధ్యులెవరు  ఆయా పోర్టల్స్ ని నిర్వహించేవారు కాదా?

ఇలాంటి బాధ్యతా రాహిత్యంతో పనిచేసే ఎల్లో జర్నలిజాన్ని ప్రోత్సహించగూడదు.  వాటిని వెంటనే నిలిపివేయాలి.  నిరాధారమైన వార్తలను ప్రచురించేవాటిని గుర్తించిన పాఠకులు వాటిని బహిష్కరించాలి.

పై కళాకారిణి విషయంలో సైబర్ క్రైమ్ పోలీస్ అధికారుల మాటల్లో చెప్పాలంటే "అదే మీ అక్కో చెల్లెలో అయితే అలాగే రాస్తారా?"  ఈ విషయంలో సైబర్ క్రైం పోలీసు అధికారులు చేసిన పని ప్రశంసనీయం.  పోర్టల్లన్నిటినీ వెతికిపట్టుకుని వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి న్యాయపరిధిలో శిక్షపడేట్టుగా కృషిచేస్తున్నారు.  అలా చేస్తేనైనా కొంతకాలానికి అలాంటి ఎల్లో జర్నలిజం అంతమయ్యే అవకాశం ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more