కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి, గత దశాబ్ద కాలనికి పైగా పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ, ఉద్యమాలకు ఆయుష్షు పోసిన తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధం అనే ప్రకటన గతంలో చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో పార్టీని విలీనం చేస్తారా అనే వాదన మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన గులాబీ నేత కేసీఆర్ కి, కాంగ్రెస్ పార్టీకి మద్య విలీనం పై చర్చలు జరిగాయనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రకటన తరువాత సీమాంధ్రలో ఉద్యమం నేటికి కొనసాగుతున్నా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వెనక్కు తగ్గేది లేదని చెప్పడంతో టీఆర్ఎస్ అధినేత పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెడితే పార్టీని విలీనం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్రమంత్రి ఏకే ఆంటోనితో ఎస్.జైపాల్‌రెడ్డి మధ్యవర్తిత్వాన చర్చలు కూడా జరిగినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ కోరినట్లు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం ఖాయమంటున్నారు. ఇందుకు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నా, కేసీఆర్ మాత్రం పూర్తి సానుకూలమేనని చెబుతున్నారు.
ఈ మేరకు రాబోయే ఎన్నికలు సహా పరస్పర అవసరాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ అధినేత, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య వివిధ ప్రతిపాదనలు ప్రస్తావనకు వచ్చాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6 తర్వాత ఏ క్షణంలోనైనా తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ వస్తుందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు విశ్వసిస్తున్నారు. ఈ మేరకు పార్లమంటు సమావేశాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంటుందని ఢిల్లీలో ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి. హోంశాఖ కేబినెట్‌కు నోట్ సమర్పిస్తుందని, ఆ తర్వాత విభజనానంతర సమస్యలపై మంత్రుల బృందం ఏర్పాటవుతుందని పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ కు ఇతర పార్టీలతో పొత్తులు ఏర్పరచే కమిటీకి కూడా ఎకె ఆంటోని నాయకత్వం వహిస్తున్నారు. ఏది ఏమైనా గులాబీ బాస్ 2014 ఎన్నికల ముందే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఖాయం అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more