తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమైక్యాంద్రకుమద్దతు బస్సుయాత్ర మొదలుపెట్టారు. గుంటూరు జిల్లాలో గురజాల నియోజక వర్గం దాచేపల్లి మండలంలోని పొందుగుల గ్రామం నుంచి బాబు యాత్ర ప్రారంభించారు.నాపై కోపం ఉంటే నా మీదే చూపండి తెలుగు జాతితో పెట్టుకుంటే మాడి మసైపోతారని చంద్రబాబు సోనియాగాంధీని హెచ్చరించారు. రాష్ట్ర విభజన అంశంపై గత 30 రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్షనేతగా విభజనపై తన గళం వినిపించేందుకు చంద్రబాబు ఆత్మగౌరవ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ చిన్నపాటి సమస్యలను సైతం ఇరు వర్గాలు కలసి చర్చించి పరిష్కారం వెతుకుతారన్నారు. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో గత కొన్నేళ్ళుగా కొనసాగుతున్న సమస్యను సీడబ్ల్యూసీ గంటపాటు సమావేశంలోనే తేల్చడం సరికాదన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, మేధావులతో ఒకటి పదిమార్లు చర్చించిన అనంతరం ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాల్సింది పోయి సోనియాగాంధీ చిచ్చురేపిందని విమర్శించారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఓ వైపు మరో వైపున కేంద్ర ఇంటెలిజన్స్ వర్గాలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు రాష్ట్రంలో కనీసం 6 స్థానాలు వచ్చే పరిస్థితి లేదనండటంతో రాష్ట్ర విభజన అంశానికి సోనియాగాంధీ శ్రీకారం చుట్టిందన్నారు.
కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్యాకేజీల వీరుడు టీఆర్‌ఎస్ నేత కెసీఆర్, బెయిల్, కేసుల మాఫీ కోసం యత్నిస్తున్న జగన్ పార్టీలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని రామలక్ష్మణుల్లా కలసివున్న రాష్ట్ర ప్రజలను వాలిసుగ్రీవుల్లా విడగొట్టిందని దుయ్యబట్టారు. 1982కు ముందు కేంద్ర స్థాయిలో గుర్తింపులేని రాష్ట్రాన్ని, ప్రజలను అన్న ఎన్టీఆర్ టిడిపి స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు వినిపించారన్నారు. అదే స్ఫూర్తితో పాలనను అందిస్తూ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని ప్రముఖ నగరాలకు ధీటుగా తీర్చిదిద్ధి ఖ్యాతిని ఖండాం తరాలుగా వ్యాపింపచేశానన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొని వచ్చి ఐటీ రంగ అభివృద్ధితోపాటు అనేక రంగాల్లో రాష్ట్రాన్ని విజయపథంలో నడిపించానన్నారు. అందుకు భిన్నంగా తొమ్మిదిన్నర ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో స్వార్థ రాజకీయాలు, తమ పదవులను కాపాడుకునేందుకే సమయాన్ని కాంగ్రెస్ నాయకులు వెచ్చించారన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబం ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒక మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more