Chandrababu writes to pm

Chandra Babu writes to PM, Chandra Babu Naidu, Manmohan Singh, Telugu Desam Party, Prime Minister Manmohan Singh, Telangana Statehood, CWC announces State bifurcation

chandrababu-writes-to-pm

ప్రధాని కలుగజేసుకోవాలని కోరుతూ చంద్రబాబు లేఖ

Posted: 08/10/2013 11:20 AM IST
Chandrababu writes to pm

కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ లబ్ధి మాత్రమే ప్రధానంగా ఎత్తులు వేస్తున్నదని, దానివలన రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందని, ప్రధాన మంత్రి వెంటనే స్పందించి పరిస్థితులు చెయిజారక ముందే కలుగజేసుకుని సరిదిద్దవలసిందని చంద్రబాబు శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్ కి లేఖ రాసారు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానూ హైద్రాబాద్ దానికి రాజధానిగానూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించటంతో సీమీంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తి అన్ని రంగాల వారూ రోడ్ల మీదకు వచ్చి తమ అసంతృప్తి ని తెలియజేస్తున్నారని, పరిస్తితి చాలా విషమంగా తయారౌతున్నదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

తన ప్రకటనతో ఆందోళనలకు దోహదం చేసి ఉసిగొలిపిన కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుని చోద్యం చూస్తున్నదని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు.  పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నది కనుక రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి దేశ ప్రధాన మంత్రిగా కలుగజేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు.

ఎనిమిదిన్నర కోట్ల సీమాంధ్రులకు సంబంధించిన నిర్ణయంలో పార్టీలన్నిటినీ సంప్రదించవలసిన అవసరం ఉందికదా ఆ పని జరగలేదు అని చంద్రబాబు అన్నారు.  అందరూ శ్రమించి అభివృద్ధి చేసిన హైద్రాబాద్ ను వదిలిపెట్టటమంటే ఆవేదన చెందటం సీమాంధ్ర ప్రాంతవాసులకు సహజమే కదా అన్నారాయన.  

ఇప్పటికే ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, చేతి పనుల వాళ్ళు, మహిళలు, న్యాయవాదులు, రవాణా మరి ఇతర వర్గాలవారందరూ 11 రోజులుగా పనులను మానుకుని రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారని, అందువలన దేశ ప్రధానిగా ఈ విషయంలో ఇంకా పరిస్థితులు చేయిజారిపోకముందే జోక్యం చేసుకోవలసిందిగా చంద్రబాబు తన లేఖలో ప్రధానమంత్రిని కోరారు.

 -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more