బాలక్రిష్ణ వరుస ప్లాపులతో సతమతం అవుతున్న టైంలో ‘సింహా ’ లాంటి హిట్ సినిమా ఇచ్చి మళ్ళీ నందమూరి నటసింహానికి పూర్వవైభవం తెచ్చిన బోయపాటి శీను దర్శకత్వంలో బాలక్రిష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొన్ననే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు ప్రారంభం అయింది. అయితే ఇంత వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఖరారు ఖాలేదు. టాలీవుడ్ ముద్దుగుమ్మలు , గతంలో బాలయ్య సరసన నటించిన నయనతార లాంటి వాళ్ళు ఈయన ప్రక్కన చేయడానికి సరేమిరా అనే సరికి ఇన్ని రోజులు హీరోయిన్ వేట సాగింది. ఎట్టకేలకు ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా మిస్ ఇండియా అయిన ఎరికా ఫెర్నాండెజ్ ను తీసుకున్నారని టాలీవుడ్ సమాచారం.
ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో ‘డేగ ’ చిత్రంలో నటిస్తుంది. బోయపాటి శీను చాలా మందిని వెతికి చివరికి ఈమెను పట్టినట్లు చెబుతున్నారు. ఈమె కూడా బాలయ్యతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమా ముహూర్తపు సన్నివేశమే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభం అయింది. ‘కొందరు ఆశించడానికి పుడతారు..కొందరు శాసించడానికి పుడతారు' అని బాలయ్య తనదైన శైలిలో చెప్పారు. మరి ఈ మిస్ ఇండియాకు ఈ సినిమా తరువాత ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more