Daggubati venkateswara rao vs tikkavarapu subbarami reddy

daggubati venkateswara rao, tikkavarapu subbarami reddy, tsr, vishakha mp seat, congress party leaders, legal notice,

daggubati venkateswara rao vs tikkavarapu subbarami reddy

నేను సారీ చెబితే... నీకే నష్టం? దగ్గుబాటి వర్సెస్ తిక్కవరపు

Posted: 06/11/2013 09:31 PM IST
Daggubati venkateswara rao vs tikkavarapu subbarami reddy

విశాఖ ఎంపీ సీటు వివాదం గాలివానలా మారుతోంది. మాటల యుద్ధం చేసిన ఇరువురు నేతలు ఇప్పుడు లీగల్ సమరానికి సిద్ధమయ్యారు. క్షమాపణలు చెబుతావా, లేదా అంటూ కేంద్ర మంత్రి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు పది రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే 5 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ స్థానం నుంచి పోటీ చేస్తానని, పురందేశ్వరి మరో స్థానం చూసుకుంటారని సమయం దొరికినప్పుడల్లా సుబ్బిరామిరెడ్డి చాటింపు వేస్తుండడంతో చిర్రెత్తుకొచ్చిన దగ్గుబాటి ఒకానొక సమూర్తం చూసుకుని సీఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టి టీఎస్సార్ పై ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం సమయంలో సిమెంట్‌ను బ్లాక్‌లో అమ్ముకున్నట్లు, కాంట్రాక్టు పనుల్లో అక్రమాలు చేసినట్లు సుబ్బిరామిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.

అక్కడితో ఆగకుండా ఆయన చరిత్ర అంతా తవ్వితీశారు. దీంతో తిక్కరేగిన తిక్కవరపువారు దగ్గుబాటిపై కయ్యిమన్నారు. కట్టుకున్న భార్యను చూసైనా నేర్చుకోవాలని ఉచిత సలహా కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈసారి దగ్గుబాటి వారు స్టైల్ మార్చి డైలాగ్ చెప్పారు. నేను సారీ చెబితే నీకే నష్టొం అంటూ, నన్ను రెచ్చగొడితే సుబ్బరామిరెడ్డికే నష్టమని దగ్గుబాటి వెంకటేశ్వర రావు హెచ్చరిక జారీ చేశారు. మరి ఈయన దగ్గరు సుబ్బిని బెదిరించడానికి ఏ అస్త్రాలు ఉన్నాయో కానీ…ఇలా నాతో పెట్టుకోకు అని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. సుబ్బరామిరెడ్డి పంపించిన లీగల్ నోటీసుల వ్యవహారం నేను కోర్టులోనే తేల్చుకుంటాను. అయినా నాతో వివాదం పొడిగించుకోవడం సుబ్బరామిరెడ్డికే నష్టం. నాతో పెట్టుకోవద్దు..నన్ను రెచ్చగొట్టొద్దు..ఇలాగే చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయాని వెంకటేశ్వరరావు తిక్కవరపు వారికి తిక్కను టచ్ చేశారు. దగ్గుబాటి వారికి చేసిన విమర్శలకు తిక్కవరపు వారు ఎలాంటి సమాదానం ఇస్తారో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more