Cinema tickets hike likely to encourage piracy

cinema tickets hike likely to encourage piracy

cinema-ticket-hike.png

Posted: 04/27/2013 12:53 PM IST
Cinema tickets hike likely to encourage piracy

సినిమా అంటే సామాన్యుడి వినోదంగా ఒకప్పుడు పేర్కొనేవారు.  కానీ ఇప్పుడు మరోసారి టికెట్ రేట్లు పెంచటంతో అది కూడా విలాసవంతమవుతోంది..  కుటుంబ సమేతంగా సినిమా చూడాలీ అంటే సినిమా హాళ్ళల్లో అధిక వెలకు విక్రయించే తినుబండారాలు, కూల్ డ్రింక్స్, పార్కింగ్ ఛార్జీలతో మొత్తమంతా కలిసి తడిసి మోపెడవుతోంది.    ఇక టికెట్ రేట్లను కూడా 20 శాతం పెంచటానికి ప్రభుత్వం ఎగ్జిబిటర్లకు పచ్చ జెండా చూపించటంతో ఇటు ప్రేక్షకులకు భారమవటమే కాకుండా, సినిమా పరిశ్రమే కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

గణితంలో కాలము-పని అనే పాఠ్యభాగంలో ఒక పనిని పదిమంది వంద రోజుల్లో చేస్తే అదే పనిని వందమంది ఎన్నిరోజుల్లో చేస్తారు అనే ప్రశ్నకు జవాబు లాగానే, ఒకప్పుడు ఎక్కువ శాతం సినిమాలు వందరోజుల పండుగను చేసుకుంటే అది ఇప్పుడు కేవలం ఒక ఆశగానే మిగిలిపోవటానికి కారణం- ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించటమే.  భారీ వ్యయంతో నిర్మించే పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువ రోజులు ఆడటానికి కూడా కారణమదే-  కొన్నే ధియేటర్లలో ప్రదర్శించటం.

థియేటరంటే అదో ప్రపంచం.  అక్కడ ఎమ్ఆర్ పి లాంటి నియమాలు వర్తించవు.  ఎంత పెంచినా అక్కడ కొనేవాళ్ళున్నారు, బయట కొని తేగూడదనే నియమాన్ని థియేటర్ యజమానులు పెట్టారు కాబట్టి థియేటర్లలోని విక్రయాలు, పార్కింగ్ ఛార్జీలు ధియేటర్ యాజమాన్యానికి అదనపు ఆదాయం.  సినిమాకు వచ్చినవాళ్ళ కోసం పార్కింగ్ ప్లేస్ ఉండాలనే నియమం ప్రభుత్వం పెడుతోంది కానీ ఆ స్థలానికి ఛార్జ్ చెయ్యగూడదనే నిబంధన లేదు కాబట్టి పార్కింగ్ అనేది ఇష్టారాజ్యంగా సాగుతోంది.  ఇన్ని అదనపు ఆదాయాలతో పాటు మాల్స్ లో నైతే ఇతర విక్రయాలు ఎలాగూ వుంటాయి.  అయినా ధియేటర్ యజమానులు, అన్ని రేట్లూ పెరిగిపోయాయి కాబట్టి మేమూ పెంచుతామంటూ గీ పెట్టి మారాం చేసి, ప్రభుత్వం చేత తలాడింపజేసారు. 

సినిమా థియేటర్లు ఆడక కాదు, లాభాలు రాక కాదు కానీ రియల్ ఎస్టేట్ లోని అధిక లాభాల కోసమే వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చివేయటం జరుగుతోంది.  విశాలమైన హాళ్ళు, ప్రాంగణం, పార్కింగ్ స్థలం, వీటన్నిటినీ చదరపు అడుగుల్లో లెక్కించి, రియల్ ఎస్టేట్ దృష్టిలో నష్టపోతున్నామని గ్రహించిన కొందరు థియేటర్ యజమానులు వాటిని కూల్చివేసి, వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు.  దాన్ని మరోవిధంగా చూపిస్తూ ఆ పని ఇంకా చెయ్యని థియేటర్ యజమానులు నష్టాల బాటలో నడుస్తున్నాయి కాబట్టి రేట్లను పెంచుకునే వెసులుబాటు కలిగించమని చాలా కాలంగా పోరుపెడుతున్నాయి.  చివరకు వారి మాటలకు తలవొగ్గి ప్రభుత్వం సరే అనటంతో ఏకంగా 20 శాతం వరకు టికెట్ రేట్లు పెరిగిపోయాయి. 

దీని వలన థియేటర్లకు తాత్కాలికంగా లాభం కనిపించినా, అది చివరకు నష్టానికే దారితియ్యవచ్చు.  అసలు వాళ్ళు ప్రదర్శించే ఉత్పాదనే నిలిచిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తారు. 

ఇంతలేసి రేట్లా, ఇక సినిమా ఎలా చూస్తాం అంటూ సినీ ప్రేమికులు అనుకుంటుంటే, సినీ నిర్మాతలు, పంపిణీదారులు ఇంకా భయపడుతున్నారు.  అసలే తెలుసు సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో ఇలా రేట్లు అమితంగా పెరిగిపోయేటప్పటికి  పైరసీ ఇంకా పెరిగిపోతుందని, దానితో సినీ పరిశ్రమ ఇంకా కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రేక్షకులను సినిమా హాలుకి రప్పించటంకోసం అత్యాధునిక ఛాయాగ్రహణ, శబ్ద గ్రహణాలను ఉపయోగించటంతో పాటు సినీ హీరో హీరోయిన్ల మీద ప్రేక్షకుల క్రేజ్ ని పెంచి, విదేశాల్లో షూటింగ్ లు, భారీ వ్యయంతో పోరాటాలు చిత్రీకరిస్తూ, ఐటం సాంగ్స్ తో అలరించే ప్రయత్నాలు చేస్తుంటే, ఇలా టికెట్ రేట్ల ను పెంచేసి వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించేసారు.  ఎంత పెద్ద దర్శకుడైనా ఇంత ఖర్చు పెడితే ఇంత వస్తుంది అన్నది చెప్పలేకపోతున్నారు.  పెద్ద సినిమాల నిర్మాతల పరిస్థితి ఇలా ఉంటే చిన్న సినిమాలకు కొనేవాళ్ళు లేకపోవటం, థియేటర్ దొరక్కపోవటం మరో సమస్య. 

లక్షలాది మంది సినీ పరిశ్రమ మీద ఆధారపడివున్నారు.  తెర మీద కనిపించే హీరో, హీరోయిన్లు, ఇతర నటీ నటులు, సంగీతం, కథ, మాటలు, సాంకేతిక బృందం వీళ్ళే కాకుండా రవాణా, కేటరింగ్, డబ్బింగ్, స్టంట్స్, ఎక్స్ ట్రా ఆర్టిస్ట్ లాంటి ఎందరో పరిశ్రమ మీద ఆధారపడి జీవితాలను వెళ్ళదీసుకుంటున్నారు.  అలాంటి పరిశ్రమ కష్టాలలో పడితే, దాని మీద ఆధారపడ్డవారి గతేమవుతుంది.  ఇప్పటికే బాగా సంపాదించిన అగ్రతారలు, దర్శకులకు ఏమీ కాదు కానీ, చిన్న చితకా మనుషులంతా పడరాని కష్టాలు పడతారు. 

ప్రత్యామ్నాయం లేకపోలేదు.  టివిల్లో ప్రసారం చేసుకోవచ్చు.  కానీ థియేటర్లో వచ్చే తృప్తి కలగదు.  అంత ఖర్చు పెట్టి ఆధునిక సాంకేతిక విలువలతో ఎంతో ప్రయాసపడి తీసిన సినిమా టివిలో ఫిల్టరై అందులో ఏ 10 శాతమో బయటకు వస్తుంది.  కథ ఒక్కటే తెలుసుకోవటానికి కాదు కదా సినిమా చూసేది.  దాని ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలంటే థియేటర్ కి పోవలసిందే.  హోమ్ ధియేటర్లు వాడినా ఆ ఆనందంలో చాలా తక్కువ శాతం వస్తుంది. 

కానీ సినిమా చూడటం ఒక్కటే కాదు మనిషికి ఇంకా ఎన్నో ఖర్చులున్నాయి కాబట్టి ఏదో విధంగా ఇంట్లోనే చూసి తృప్తి పడదామనుకుంటే, ఇప్పటికే అదుపు తప్పిన పైరసీ ఇంకా విజృంభించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

  -శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more