నిజామాబాద్ జిల్లా అర్మూర్. అక్కడ 45 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు. రెండు లక్షల చదరపు అడుగుల్లో లక్షల మంది హాజరవటానికి, సౌకర్యంగా కూర్చోవటానికి, భోజనాది సదుపాయాలతో ఏర్పాటైన వేదిక అది. వచ్చినవారికి గుర్తుండిపోయేలా కార్యక్రమాలు, అందరినీ అలరించటం కోసం శాకాహార మాంసాహార వివిధ తెలంగాణా ప్రత్యేక వంటకాలతో ఘనమైన ఏర్పాట్లు. ఇంతకీ ఎందుకా వేదిక.
2001 లో ఏప్రిల్ 27 న ఆవిర్భవించిన తెలాంగాణా రాష్ట్ర సమితి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ పార్టీ పండుగ చేసుకుంటోంది. అందుకు నిజామాబాద్ అర్మూర్ ని వేదికగా చేసుకుంది. తన సొంత నియోజకవర్గం, మంచి పట్టున్న కరీంనగర్ లో కాకుండా ఆర్మూర్ లో వేడుకను చేసుకోవటానికో కారణముంది. తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తెలంగాణా రాష్ట్ర సాధనకోసం ఉద్యమం చేపట్టటానికో జాతీయ పార్టీని స్థాపించినప్పుడు మున్ముందుగా మేమున్నాం మీతో అంటూ ముందడుగు వేసినవారు అర్మూర్ ప్రజలే కాబట్టి, వారి సాహసాన్ని, వెన్నంటి ఉంటామని చేసిన బాసలు, చూపించిన నమ్మకాన్ని గుర్తు తెచ్చుకుంటూ అక్కడే ఈ పుష్కర వేడుకలను చెయ్యదలచుకున్నారు.
119 శాసన సభ నియోజక వర్గాల నుండి వచ్చే ప్రతినిధులకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, లక్షలాది మంది హాజరై, ఈ వేడుకలలో కేవలం వేడుకల్లాగానే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కోసం కెసిఆర్ ఉద్యమకారులను, కార్యకర్తలనూ, తెలంగాణా ప్రజలనూ వచ్చే ఎన్నికలకోసం సమాయత్తం చేయనున్నారు. ఎన్నికల వ్యూహంలో ముఖ్యంగా కెసిఆర్ ఈ సారి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదలచుకోలేదు. అందుకోసమే పార్టీలో చేరే వాళ్ళని చేరటం కోసం కెసిఆర్ లోగడ ఆఖరు తేదీని కూడా ప్రకటించారు. ఇప్పటి నుంచి ఎన్నికల వరకు కేవలం ఎన్నికల ప్రణాళికను అమలు పరచటమే తప్ప మరో కార్యక్రమం ఉండబోదనే సంకేతాలు అందుతున్నాయి. ఉద్యమాన్ని రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్ళటానికి మరోసారి ఆర్మూరు నుంచే కదం కలిపి ముందుకు సాగటానికే ఆర్మూర్ లో పుష్కర వేడుకలను ఏర్పాటు చేసారు కెసిఆర్.
నిజామాబాద్ నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చెయ్యబోతున్న కెసిఆర్ కూతురు తెలంగాణా జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత కూడా ఈ సారి తెరాస వేడుకల్లో చురుగ్గా పాల్గొనబోతున్నారన్న వార్త వినబడుతోంది.
తెలంగాణా ఉద్యమాగ్నిలో పోసే ఆద్యంలా బయ్యారం గనుల్లాంటి అంశాలు పనిచేస్తే వాటిని పూర్తిగా వాడుకుంటూ 28 తీర్మానాలతో తెరాస భావి రాజకీయ ప్రణాళికతో విజృంభించబోతోంది. ఈ కార్యక్రమమంతా తెరాస పార్టీ ఇన్ ఛార్జ్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more