సినీ పైరసీలు సినీ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఎంతో కష్టపడి, భారీ వ్యయంతో, ప్రేక్షకులను అలరించటానికి నానా తిప్పలూ పడి సినీ నిర్మాణాన్ని చేస్తే, విడుదలవుతూనే ఆధునిక సాంకేతిక పరిఙానాన్ని ఉపయోగించుకుని దాని పైరసీ కాపీలు తయారుచేసేస్తున్నారు. దీన్ని నిరోధించటానికి సినిమారంగం ఎంతోకాలంగా ఎన్నోరకాలుగా విఫల ప్రయత్నాలు చేస్తూవస్తోంది.
సినిమారంగం, పోలీసు శాఖ సంయుక్తంగా ఇండియన్ మూవీ కాప్ అనే పేరుతో రూపొందించిన ఒక మొబైల్ అప్లికేషన్ ని అమెరికా అంబాసిడర్ దాన్ని లాంఛనప్రాయంగా ఆదివారం లాంచ్ చేసారు. ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. మామూలుగా ఫోన్ బ్రౌజర్ సాయంతో ఆడుతున్న సినిమాల గురించి తెలుసుకుని వాటి టెకెట్లను కొనుగోలు చెయ్యవచ్చు. దీనికోసం రిజిస్టర్ చెయ్యవలసిన అవసరం లేదు.
రెండవది, ఒకవేళ పైరసీ నిరోధంలో పోలీసులకు, సినిమారంగానికి చేయూతనివ్వదలచుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. దానితో ఆ ఫోను యజమాని 8 భారతీయ భాషల్లో దేన్నైనా ఉపయోగించుకుంటూ పైరసీ వివరాలను తెలియజేయవచ్చు.
ఈ మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేసిన సందర్భంలో ఆ కార్యక్రమంలో, ప్రస్తుతం జోరుగా ఆడుతున్న బాద్షా హీరో జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, దర్శకుడు రాజమౌళి, పోలీసు డైరెక్టర్ జనరల్ దినేష్ రెడ్డి భాగం వహించారు.
అమెరికన్ అంబాసిడర్ నాన్సీ పౌవెల్ మాట్లాడుతూ, ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్న తెలుగు సామెతకు సమాంతరంగా ఇంగ్లీషులో నిప్పుని నిప్పుతోనే ఓడించాలి (ఫైట్ ఫైర్ విత్ ఫైర్) అని అన్నారు. సాంకేతిక పరిఙానాన్ని ఉపయోగించుకుని పైరసీ చేస్తున్నప్పుడు దాన్ని నిరోధించటానికి సాంకేతిక పరిఙానాన్ని ఉపయోగించటం చాలా సరైన మార్గమన్న అభిప్రాయాన్ని నాన్సీ అలా చెప్పారు.
సినిమా చూసే వాళ్ళ దగ్గర్నుంచే ఆచూకీ తెలుసుకోవటానికి చేసిన మొదటి ప్రయత్నమంటూ సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ కృష్ణ ప్రసాద్ కొనియాడారు.
అంటే, ఈ పద్ధతి ఆటోమేటిక్ గా పైరసీని అరికట్టేదేమీ కాదు. ప్రేక్షకులు దయాధర్మాలతో ఇచ్చే ఆచూసీ మీద ఆధారపడిందే కానీ పైరేటెడ్ సినిమాలను వీక్షించేవాళ్ళకి కాకుండా దీన్ని సినిమా హాలుకి వెళ్ళి సినిమా చూసేవాళ్ళకోసం రూపొందించింది కాబట్టి సత్ఫలితాలనివ్వచ్చని భావిస్తున్నారు. సినిమా చూస్తున్న సమయంలో పక్కవాళ్ళు పైరసీకి పాల్పడితే తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ ఫోన్ అప్లికేషన్ తో ఆచూకీ తెలియజేస్తే పోలీసులు, చట్టం తమ పని తాము చేసుకుంటాయి.
పురజనులు మఫ్టీలో ఉన్న పోలీసులే అన్న నినాదం ఆధారంగా ఈ అప్లికేషన్ కి భారతీయ చిత్ర రక్షకభటుడు (ఇండియన్ మూవీ కాప్- ఐఎమ్ సి) అని పేరుపెట్టారు. ఆ ఎవరు రిపోర్ట్ ఇస్తారు అని తేలిగ్గా తీసుకునేవారున్నారు కానీ సమయానికి అందిన ఒక్క చిన్న ఆచూకీ చాలు నేరస్తుల ఆటకట్టించటానికి. బాధ్యతాయుతంగా ప్రవర్తించే పౌరులున్నారు. కాకపోతే మరో పరిమితి ఏమిటంటే, ఇది కేవలం వైఫై తో కానీ జిపిఆర్ఎస్ సెట్టింగ్స్ తో కానీ స్మార్ట్ ఫోన్స్ లేక ఆండ్రాయిడ్స్ ని ఉపయోగిస్తున్నవాళ్ళే చెయ్యగలరు.
ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఇది చీకట్లో వేస్తున్న ఒక రాయే కానీ ఏమో ఫలితాలను ఇచ్చినా ఇవ్వవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more