కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రాజకీయలంటే భయపడుతున్నారు. అయితే దేశం మొత్తం ఒక రాజకీయం నడుస్తుంటే ..? ఒక్క రాష్ట్రంలోనే అన్ని రాజకీయ నడుస్తున్నాయి. పార్టీలో ఉన్న మేకవన్నె పులులతో రాహుల్ గాంధీ భయపడుతున్నారు. రాజకీయ ప్రక్షాళన చెయ్యాలని యువ రక్తంతో అడుగుపెట్టిన రాహుల్ కు ఆంధ్రప్రదేశ్ రాజకీయలతో బ్రేక్ పడుతుంది. ఒక పక్క కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న సమయం. అక్కడ పార్టీని బలోపేతం చెయ్యటానికి రాహుల్ సైన్యం కష్టపడుతుంది. అయితే రాహుల్ గాంధీ మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయల మీద నిఘా పెట్టినప్పటికి ఫలితం మాత్రం శూన్యమే. పార్టీలో ‘‘ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని వారు ఎక్కువుగా ఉన్నారు’’. పార్టీ కోసం కష్టపడే నాయకులు ఎంత మంది ఉన్నారో వేళ్ల మీద చెప్పవచ్చు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు సొంత పార్టీ మంత్రుల నుంచే వ్యతిరేక రావటం జరిగింది. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో కేంద్ర మంత్రి డాక్టర్ చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖ పై ఎలాంటి స్పందన లేకుండానే . చిరు లేఖ పై కిరణ్ కుమార్ రెడ్డీ కేకలు వేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోవటం జరిగింది.
అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై, ముఖ్యమంత్రి ఒక నివేదిక తయారు చేయటం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి చిరంజీవి పై ఫిర్యాదు చెయ్యాటానికి సీఎం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‑కుమార్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కిరణ్ నివేదిక అందచేశారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేదని, ఎలాంటి చర్యలు చేపడుతున్నారని రాహుల్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అవిశ్వస తీర్మానంలో ప్రభుత్వనాకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేల విషయం పై సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన నివేధిక చూసిన రాహుల్ గాంధీకి గుండెల్లో భయం పట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ పై ఆశలు పెట్టుకోవాలా, వద్దా అనే మీమాంసలో రాహుల్ గాంధీ పడినట్లు సమాచారం. అయితే మొత్తం మీద కిరణ్ కుమార్ రాహుల్ గాంధీకి కొత్త భయం పెట్టాడని ఢిల్లీ నాయకులు చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more