Mp harikrishna counter on balakrishna

mp harikrishna , Harikrishna vs Balakrishna, tdp, MP Nandamuri Harikrishna, Laxmi Parvathi counter to Balakrishna, junior ntr, senior ntr photo flex, minister purandeaswari, chandra babu naidu, lokesh babu, balakrishna, balaiah, tdp fans, ntr fans, ysrcp party, congress party,

బాలయ్యకు హరిక్రిష్ణ కౌంటర్ ?

Posted: 04/08/2013 06:24 PM IST
Mp harikrishna counter on balakrishna

నందమూరి వంశంలో జరుగుతున్న ఫోస్టర్ వివాదం ముదిరి పాకనపడింది. నిన్నటి వరకు బాబాయ్ కు అబ్బాయి మద్యే సైలెంట్  యుద్దం నడుస్తూ వస్తుంది. బాబాయ్, అబ్బాయిల మద్య  అభిమానులు నలిగిపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మౌనం పై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ‘‘నేను బతికున్నంత వరకు తెలుగుదేశం పార్టీ విడేది లేదని’’ గంటపదంగా చెప్పిన జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు కొత్త ఎత్తులతో , టిడిపి అధినేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన ఎమ్మెల్యే కొడాలి నానితో కొత్త రాజకీయానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఎన్టీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు.  ఫోస్టర్ వార్ విషయంలో  చివరకు లక్ష్మీ పార్వతి, కాంగ్రెస్ మంత్రి అయిన దగ్గుబాటి పురందేశ్వరి  సీనియర్ ఎన్టీఆర్ ఫోటో పై ఒక ప్రకటన చేయటం జరిగింది. అయితే బాలయ్య మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు ఒక వార్నింగ్ మేసేజ్ ఇవ్వటం జరిగింది. వార్నించి ఇచ్చి 24 గంటలు దాటిపోయిన మాత్రం ఎన్టీఆర్ స్పందించలేదు. కానీ ఎన్టీఆర్ తరుపున మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ హరిక్రిష్ణ.  సీనియర్ ఎన్టీఆర్  గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు. కానీ ఆయన ప్రజల మనిషి కాబట్టి  ప్రతి ఇంట్లో  ఆయన చిత్రపటం పెట్టుకోవచ్చునని చెప్పటం జరిగింది.  అయితే ఇక్కడితే హరిక్రిష్ణ మాటలు ఆపితే బాగుండేది. కానీ ఒక్క అడుగు ముందుకు వేయటంతో  నందమూరి కుటుంబంలో  అన్నదమ్ములు, తండ్రి , కొడుకులుబావా, బావమరుదులు మధ్య ఉన్న ఎడబాటు ఏమిటో  మీడియాకు, ప్రజలకు బాగా అర్థం అయ్యింది.  ఎన్టీఆర్  ఫోటో  ఎవరైనా  పెట్టుకోవచ్చని, దానిని మేమం కాదనలేమన్నారు. ఎవరో అభిమాని పెట్టిన ప్లెక్సీని మేము ఎందుకు కాదనాలి చెప్పండి అని మీడియా వారిని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఫోటో  పెట్టుకోవడం  రాజకీయ వ్యభిచారం ఎందుకవుతుందని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ విషయంలో  జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ఫోటో విషయం  జూనియర్ కు  తీవ్ర పరిణామాలు  ఉంటాయనడం.. అనేది మంచి విషయం కాదు. బాలయ్య  ఈ విషయంలో ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారో  ఆయనకే తెలియాలని హరిక్రిష్ణ చెప్పటం జరిగింది.  ఏదైన ఉంటే  టిడిపి పార్టీని  బతికించుకునేందుకు బాలయ్య ప్రయత్నించాలి, అంతేకానీ జూనియర్ ఎన్టీఆర్ పై మండిపడటం మంచి కాదని  ఆయన హితువు పలికారు. అసలు ప్రజల్లో  పార్టీపై ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో  బాలయ్య తెలుసుకోవాలని  సూచించారు. 

దీనిని బట్టి చూస్తే  చంద్రబాబు , బాలయ్య, లోకేష్ బాబు, హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్పురందేశ్వరిల మధ్య ఉన్న వివాదం  ఏ స్థాయిలో ఉందో అర్థమైందని మీడియా  వర్గాలు అంటున్నాయి.  2014 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతెలుగుదేశం పార్టీ లు కలిసి ఎన్టీఆర్ బొమ్మను వాడుకుంటాయి.  అంతేకాకుండా మిగిలిని.. సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీ, బిజేపీ, ఎంఐఎం పార్టీలు ఎన్టీఆర్ బొమ్మను వాడుకున్న ఆశ్చర్యంలేదని   సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఇక జరగబోయే యుద్దం బాబాయ్ అబ్బాయిల మధ్య కాదట.. అన్నదమ్ముల మధ్య యుద్దం మొదలవుతుందని  టిడిపి పార్టీ  సీనియర్ నాయకులు అంటున్నారు. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీ జెండా కిందకు వెళ్లాతారోలేక బావ మాటలకు మళ్లీ బంధి అవుతారో చూడాలి.  ఏమైన ఇలాంటి వివాదం వలన  పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని సీనియర్ నాయకులు అంటున్నారు.  దీని వలన జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా నష్టం లేకపోయిన లాభం మాత్రం  చాలా ఉందని  అంటున్నారు.  ఎన్టీఆర్ ఉన్న బలమెంతో తెలిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయిన ఎన్టీఆర్ అప్పుడే రాజకీయల్లోకి వస్తాడా? స్టార్ హీరో రేసులో ఉన్న ఎన్టీఆర్  సినిమాలను వదులుకోని .. రాజకీయల్లోకి వస్తాడా? అనే ప్రశ్న అభిమానులను వేధిస్తుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more