Necessity of guideles for protests and prohibitions on them

telugu desam party, ram dev baba, ramleela maidan, arvind kejrival, supreme court of india, protest against govt

necessity of guideles for protests and prohibitions on them

guidelines-for-agitations.png

Posted: 03/31/2013 10:43 AM IST
Necessity of guideles for protests and prohibitions on them

 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. భారత భూభాగంలో భారతీయులు ఎక్కడైనా తిరగవచ్చు. అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా చూసే బాధ్యత పోలీసు శాఖది- ఇది ఎవరో సామాన్యమైన వ్యక్తి అన్న మాటలు కావు. సాక్షాత్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అన్న మాటలు. రెండు సంవత్సరాల క్రితం యోగా గురు రామ్ దేవ్ బాబా ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో అవినీతికి వ్యతిరేకంగా నిరసన సభను నడుపుతున్న సమయంలో అర్ధరాత్రి బాబా శిష్యుల మీద పోలీసులు విరుచుకుపడ్డ సంఘటన మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య.

ramleela-maidan2

అర్ధ రాత్రి తిరగకూడదని, సెక్షన్ 144 విధిస్తున్నామని పోలీసు అధికారులు చేసే ప్రకటనలు కేవలం శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యం తోనే. అలా భంగం జరగకుండా చూడటానికేగా మీరున్నారు అంటుంది సుప్రీం కోర్టు. ఓటు వేసాం కాబట్టి ఐదు సంవత్సరాలు మాట్టాడగూడదనే నియమం ప్రజాస్వామ్యంలో లేదు. ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు నిలదీసే హక్కు, నిరసన చూపించే అధికారం పౌరులకుంది. అలా నిరసనలు చెయ్యవద్దు, ప్రతిఘటించటం పాపం అంటే ఎలా. మేము ఏం చేసినా మాట్లాడగూడదు అనే అర్థమే వస్తుందక్కడ.

ramleela-maidan

బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలమీద పోయిన సంవత్సరం నిరసన తెలియజేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ బహిరంగ సభను నడిపిన అరవింద్ కేజ్రీవాల్, అతని మద్దతుదారులను సెక్షన్ 144 విధించి దాన్ని ఉల్లంఘించారంటూ వాళ్ళమీద మోపిన నేరారోపణల మీద ఢిల్లీ కోర్టులో మేజిస్ట్రేట్ జే థరేజా పోలీసులను వివరణ కోరారు. నిషేధాఙలను విధించాల్సిన అవసరమేమొచ్చిందో కోర్టు వేసవి శలవుల తర్వాత కేసు విచారణ తేదీ జూన్ 26 వరకు తెలియజేయమని మేజిస్ట్రేట్ కోరారు నిషేధాఙలు జారీచెయ్యటానికి పోలీసులు చెప్పిన కారణాలకు సాక్ష్యాధారాలుగా . వీడియో ఫుటేజ్ లను కూడా సేకరించి సమర్పించమని కోర్టు ఆదేశించింది.

స్వేచ్ఛగా తిరగటం, స్వేచ్ఛగా మాట్లాడటం, నిరసనలు తెలియజేయటం- ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కులే అవి. మీరు వాటిని చేస్తే శాంతి భద్రతలకు భంగం కలుగుతుందంటూ పోలీసులు అభ్యంతరాలు చెప్పటం సరికాదని పదే పదే న్యాయస్థానాలు చెప్తున్నాయి. నిరసన గళాలను నొక్కివేయటానికి నిషేధాఙలు జారీ చెయ్యటమనేది రాజకీయ ఎత్తుగడలో భాగంగా గోచరించే అవకాశం కూడా ఉంది.

నిరసనలు చెయ్యటానికి ఒక మార్గం సభలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మద్దతు కోరే ప్రక్రియ ఒకటైతే, మరొకటి గాంధీ మార్గంలో శాంతియుతంగా దీక్షలు చెయ్యటం. సభల విషయంలో న్యాయస్థానాలు స్పష్టంగా ఉన్నా, నిరాహార దీక్షలు ఆత్మహత్యా ప్రయత్నం లోకి వస్తాయన్న నెపంతో వాటిని భగ్నం చెయ్యటం, షర్మిలా లాంటి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టటమనేవాటిని విఙులు విమర్శిస్తున్నారు. ప్రాణం తీసుకునే హక్కు భారతదేశంలో న్యాయస్థానాలు పౌరులకు ఇవ్వలేదు. కానీ నిరసన గా నిరాహార దీక్ష చెయ్యటం నేరమెలా అవుతుంది. అందులో ఉద్దేశ్యం ప్రాణం తీసుకోవటం కాదే. బ్రతకటం కోసం అనుకూలమైన పరిస్థితులు కల్పించమని అడగటం బ్రతుకుని బుగ్గిచేసుకోవటం లకి ఎలా వస్తుంది.

హైద్రాబాద్ లో నిరాహారదీక్ష శిబిరాలకు అర్ధరాత్రి వచ్చి ప్రజాప్రతినిధులను సైతం బలవంతంగా తరలించటం ప్రజాస్వామ్యమేనా అని విశ్లేషకులు అడుగుతున్నారు. దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు దాని మీద న్యాయస్థానం గడప ఎక్కలేదు. దీక్షలు విరమిస్తున్నామని కూడా తెలియజేసారు. కానీ పోలీసులు అలా చెయ్యటం సరైన మార్గమేనా. పైగా అది సభాపతి ఆదేశమంటూ పోలీసులు చెప్పటంతో అధికారపక్షానికి ఇబ్బంది కలిగించే పనేమీ చెయ్యగూడదనే సంకేతాలు వస్తున్నాయి.

tdp-fasting

అలాగని ఊరుకున్నా పోలీసులనే అంటారు. చిన్నపిల్లలకు ఆడుకునే హక్కుంది, ఆడుకోవటం అవసరం కూడా. అది వాళ్ళ ఎదుగుదలకు ఉపకరిస్తుంది. కానీ చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు దెబ్బలు తగలకుండా చూడటం పెద్దల బాధ్యతే. అలాగని వాళ్ళని అడుకోకుండా కట్టడి చెయ్యటం కూడా సరికాదు. పెల్లుబికిన నిరసనల వలన ఉద్వేగాలు వశంతప్పి, ఏదైనా జరగరానిది జరిగితే, మీరేం చేస్తున్నారు అని పోలీసులను నిలదీస్తారు. అంత జరుగుతుంటే చోద్యం చూస్తున్నారు, పోలీసులు ప్రేక్షకుల పాత్రలను పోషించారంటూ విమర్శనలను గుప్పిస్తారంతా.

అందువలన నిరసనలకు మార్గదర్శకాలను తయారు చేసే అవసరం ఎంతైనా ఉంది. నిరసనలు ఎంత వరకు వెళ్ళవచ్చు, ఏ విధంగా చెయ్యవచ్చు, అదుపు తప్పకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి- ఇలాంటి విషయాల మీద సంపూర్ణావగాహన అందరికీ కలిగే విధంగా నియమాలను రూపొందిస్తే ఇటు పోలీసులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ ఎవరూ విమర్శలను ఎదుర్కోకుండా ఉంటారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gps laced lingerie to check rape cases
Hand looms need support to save dying art  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more