మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో, మహిళల రక్షణకోసం జిపిఎస్ మోడ్యూల్స్ తో కూడిన లోదుస్తులను చెన్నైలోని ఒక ఆటోమొబైల్ ఇంజినీర్ బృందం రూపొందించింది.
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మోడ్యూల్స్ ని ఫాబ్రిక్ లో అల్లటం వలన, అత్యాచారం జరిపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ దుస్తులను ధరించిన అమ్మాయి తల్లిదండ్రులకు, పోలీసులకు కూడా సూచనలను పంపిస్తుంది. అంతేకాకుండా, వత్తిడిని గ్రహించే సెన్సర్స్ 3800 కెవి ల విద్యుత్ఘాతాన్ని విడుదల చేస్తుందట. అలా 82 సార్లు చెయ్యగలదట. పోలీసుల సహాయాన్ని అర్థించే సమయం లేని సందర్భాల్లో ఈ ఏర్పాటు చాలా బాగా పనిచేస్తుందని, సమాజంలోని దుశ్చర్యలకు దీనితో ఆనకట్ట పడుతుందని ఈ పరికరాన్ని తయారుచేసినవారు చెప్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, అహ్మదాబాద్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఈ పరిశోధనకు గాంధియన్ యంగ్ టెక్నాలజీ 2013 పురస్కారం లభించింది.
ఈ వస్తువుని తయారు చెయ్యటానికి సరైన ఫాబ్రిక్ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహాయాన్ని కోరుతున్నామని దీన్ని రూపొందించిన బృందం చెప్తోంది.
ఇది ఎంతవరకు విజయవంతమౌతుందో కానీ, ఇలాంటిది ఒకటి ఉందని తెలిస్తేనే అత్యాచారాలకు ఒడిగట్టటానికి భయపడతారు. కాకపోతే దీని రూపకల్పన కేవలం లైంగిక అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. లైంగికంగా బాధించేముందు మానసికంగా వత్తిడికిగురిచేసి, అవమాన పరచి, యాసిడ్ దాడుల్లాంటి చర్యల్లో ఈ పరికరం ఎందుకూ పనికిరాదు. భయపెట్టి దాన్ని తీసేయమని మహిళను బెదిరించగలరు కూడా.
కానీ ఢిల్లీ సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తర్వాత యువత దృష్టికోణంలో మార్పు వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఈ పరిశోధన చెప్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more