Ambani group cos market capitalisation falls

Ambani group companies market value, Ambani group companies market capitalisation, Mukesh Ambani, Anil Ambani, political uncertainty, global market sentiment, ,Companies,Reliance Capital Limited,Reliance Communications Limited,Reliance Industrial Infrastructure Limited,Reliance Industries Limited,Reliance Infrastructure Limited,Reliance MediaWorks Limited,Reliance Power Limited,economy, business and finance,stocks and shares

The two Reliance groups headed by Mukesh and Anil Ambani have seen their respective market values skid by about Rs 10,000 crore each in a week.

Ambani group cos market capitalisation falls.png

Posted: 03/25/2013 04:12 PM IST
Ambani group cos market capitalisation falls

ambani brothers

అంబానీలు... ఈ పేరు వినగానే ప్రపంచ కుబేరుల్లో వీరు ప్రముఖులు అనేది గుర్తుకు వస్తుంది. ప్రపంచ కుభేరుల జాబితాలో టాప్ పొజిషన్లో ఉన్న వీరి సంపద ఆవిరి అయిపోయింది. గత వారం స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో రిలయన్స్‌ గ్రూపు చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, ఆయన సోదరుడు అనిల్‌ అంబానీలకు చెందిన షేర్లు పడిపోవడంతో వీరికి సంబంధించిన కోట్ల సంపద ఆవిరి అయిపోయాయి. వీరి కంపెనీల మార్కెట్‌ క్యాపిటలయిజేషన్‌ చేరో రూ.10,000 కోట్ల వరకు కోల్పోయారు. ముఖేష్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన మార్కెట్‌ క్యాప్‌ రూ.10,700 కోట్ల వరకు కోల్పోయి రూ.2.63 లక్షల కోట్లకు చేరింది. ముఖేష్‌కే చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.500 కోట్ల కంటే తక్కువగా ఉంది. అనిల్‌ అంబానీకి చెందిన ఆరు లిస్టెడ్‌కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ అమ్మకాల ఒత్తిడికి గురయి సుమారు రూ.9,600 కోట్ల వరకు క్షీణించి రూ.45,620 కోట్లకు చేరింది. రిలయన్స్‌ పవర్‌ ఎం క్యాప్‌ రూ.3395 కోట్లు కోల్పోయింది గత వారం 16 శాతం వరకు క్షీణించి రూ.61.05 వద్ద ముగిసింది. ఆర్‌కామ్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,590 కోట్ల వరకు క్షీణించి రూ.11,156 కోట్లకు చేరింది.

tata-dlf

వీరిద్దరికి చెందిన షేర్లే కాకుండా, టాటా గ్రూపు, మహీంద్రా గ్రూపు, భారతి గ్రూపులు కూడా నష్టపోయాయి.  టాటాగ్రూపునకు చెందిన మొత్తం 30 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ గత వారం రూ.18,000 కోట్ల వరకు క్షీణించింది. అనిల్‌ అగర్వాల్‌కు చెందిన స్టెరిలైట్‌ గ్రూపు, సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతి గ్రూపు కూడా తమ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌లు వరుసగా 8,500 కోట్లు, రూ.9,000 కోట్లు కోల్పోయాయి. ఆదిత్య బిర్లాకు చెందిన గ్రూపు మొత్తం రూ.6,000 కోట్లు , మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌లు వరుసగా తమ మార్కెట్‌ విలువను రూ.5,500కోట్లు రూ. 7,000 కోట్ల వరకు కోల్పోయాయి. దీనంతటికి దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ట్రేడింగులకే కారణం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంబానీ సోదరులు ఎక్కువ పవర్, ఇన్ ఫ్రారంగాల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు రంగాలు ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుడమే వీరి సంపద ఆవిరికి కారణాలుగా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cags report is not gita bible ap cm
Chiranjeevi to release first look of toofan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more