తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెంట్ పై కారాలు మిరియాలు నూరిన టిడిపి నాయకులకు, విపక్ష నేతలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు. కాగ్ నివేదిక భగవద్గీత, బైబిల్, ఖురాన్ కాదని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌పై స్వల్పకాలిక చర్చలో భాగంగా శాసనసభలో కాగ్ నివేదిక ప్రస్తావనకు వచ్చింది. చర్చను ప్రారంభించిన టిడిపి సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ విద్యుత్ అంశంపై కాగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 50 శాతం అదనంగా ఖర్చు చేస్తున్నారని, ప్రైవుటు విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసే దానికన్నా ఎక్కువ మొత్తానికి జెన్‌కోకు గ్యాస్ సరఫరా జరుగుతోందని కాగ్ తప్పుపట్టిందని చెప్పారు. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న బొగ్గులో కూడా పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటోందని కాగ్ పేర్కొందని ఆయన చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ కాగ్ నివేదిక భగవద్గీత, బైబిల్ కాదని చెప్పారు. కాగ్‌కు కొన్ని పరిమితులుంటాయని, దానికి లోబడే నివేదికను రూపొందిస్తుందని అన్నారు. కాగ్‌లో పేర్కొన్నంత మాత్రాన ఏదో జరిగినట్టు కాదని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్ద వ్యవస్థ స్ఫూర్తిని నీరుగార్చేలా ముఖ్యమంత్రి మాట్లాడటం సబబుకాదని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే అధికారయంత్రాంగం కాగ్‌కు ఎంతమాత్రం విలువిస్తుందని ప్రశ్పించారు. నిప్పు లేకుండా పొగరాదని.ఎంతో కొంత మేర అవకతవకలు జరిగిఉంటేనే కాగ్ నివేదికలో ప్రస్తావిస్తుందని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకే మాట మాట్లాడతానని చెప్పారు. కాగ్ కొన్ని పరిమితులకు లోబడే నివేదిక ఇస్తుందని, ఆ తరువాత పిఎసిలో దానిపై చర్చజరిగి తుది నివేదిక సిద్దమవుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం పనుల్లో 14వేల కోట్ల రూపాయల మేర అవినీతి చోటుచేసుకున్నట్లు ఇటువంటి నివేదికనే ఇచ్చిందని, అప్పటి పిఎసి సభ్యుడిగా తాను ఆ పేరాగ్రాఫ్‌ను తొలగించడానికి అంగీకరించానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more