బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ 1993లో జరిగిన ముంబయి వరుస పేళుళ్ళ కేసులో నింధుతుడిగా ఉన్న విషయం తెలిసిందే. బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా...713 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును జాతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పెద్ద సంఖ్యలో ఉన్న అప్పీళ్లు, క్రాస్‌అప్పీళ్లపై కూడా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నింధితులు అయితన యాకూబ్, అబ్దుల్ రజాక్ మెమోన్‌లకు ఉరిశిక్షను విధించింది. మరో పదిమందికి జీవిత ఖైదు విధించింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి ఐదు సంవత్సారాల జైలు శిక్ష వేసింది. శిక్ష పడిన నిందితుల అప్పీలును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు నడుస్తున్న కాలంలో సంజయ్ దత్ ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఈ తీర్పుతో అతను ఇంకా మూడు సంవత్సరాల 6 నెలలు జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
ఈ తీర్పు సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేసింది. ఈ పేళుళ్ళలో ఉద్రవాదులకు పాకిస్థాన్ లో ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని, దేశం పై జరిగిన కుట్రలో మహారాష్ట్ర పోలీసుల హస్తం, కస్టమ్స్ అధికారుల హస్తం ఉందని సుప్రీం పేర్కొంది. బాంబు పేళుళ్ళకు కుట్ర పన్నిన వారు ముంబయి నుండి దుబాయ్ వెళ్లారని, అప్పటి బాధితులకు న్యాయం జరగాలంటే నింధుతులు శిక్ష అనుభవించాల్సిందేనని, 2006లో టాడా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ కేసులో మరో నింధుతుడు తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంది. ఇక ఇందులో శిక్ష పడిన సంజయ్ దత్ ని నాలుగు వారాల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more