Cbi investigation on kvp

kvp ramachandrarao, ys rajashekar reddy, cbi eye on kvp, role in ysr government period

kvp ramachandrarao, ys rajashekar reddy, cbi eye on kvp, role in ysr government period

CBI investigation on KVP.png

Posted: 03/21/2013 11:42 AM IST
Cbi investigation on kvp

CBI

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అత్మ బంధువు అయిన కేవీపీ రామచంద్రారావు పై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఓ కన్నేసింది. వైయస్ రాజశేఖర్ రెడ్ది హయాంలో ఆయన చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన పోషించిన పాత్ర పై కూపీ లాగుతుంది. ఆయన అప్పటి ప్రభుత్వంలో పోషించిన పాత్ర గురించి సమాచారం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈయనను జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగానే వివరాలు అడుగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఇరుక్కొని జైలు పాలయిన విషయం తెలిసిందే. మరి కొంత మంది పై కూడా సీబీఐ ఛార్జిషీటు ధాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం పార్టీ వారు వైయస్ ఆత్మను కూడా విచారించాలని ఆయన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అంటున్న విషయం తెలిసిందే. కానీ ఇంత వరకు సీబీఐ కేవీపీని విచారణకు పిలవలేదు.

kvp-jagan

గతంలో ఓ సారి ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా మాత్రం ఓసారి కేవీపి సిబిఐ ఎదుట హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కెవిపి కీలకంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. వైయస్ వద్దకు వెళ్లాలంటే మొదట కెవిపిని కలవాల్సిందే అనేవారు. మొదటిసారి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక కెవిపిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. కేబినెట్ హోదా కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. అయితే జోడు పదవుల వివాదం తలెత్తడంతో ఓ పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన పూర్తిగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని పదవుల నుండి తప్పుకున్నారు. మరి ఈకేసు మెల్లిగా మెడకు చుట్టుకొని జైలు పాలు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీ విశ్లేషకులు. ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjay dutt gets five year jail
Sadak bundh and taking it personal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more