Modern movie promos

cinema promotion, movie world, deepika padukone, ranbir kapoor, karan johar

modern movie promos

cine-promos.png

Posted: 03/20/2013 01:35 PM IST
Modern movie promos

ranbir-deepika

దీపికా, రణబీర్ ల రసాయనాలు అనుకూలంగానే ఉన్నాయట.  ప్రేమను రసాయనిక శాస్త్ర పరిధిలో కొలుస్తూ, కెమిస్ట్రీ కలుస్తుంది అనే రోజులివి.  వ్యవసాయంలోనూ, ఔషధాలలోనూ కెమికల్స్ ని తినటం మొదలైన తర్వాత మనసులో కూడా రసాయనాలే రాజ్యం చేస్తున్నాయి కదా మరి.  అలాంటప్పుడు దీపిక చేసిన ఇలాంటి వ్యాఖ్యలు విపరీతార్థాలకు దారితీస్తుందని కూడా తెలుసు కానీ ప్రచారమే ప్రధానం కాబట్టి మిగతావి పట్టించుకోరు.  పైగా రాయటానికి, వక్రీకరించటానికి మీడియాకు ఎంత అవకాశమిస్తే ప్రచారం అంత బాగా జరుగుతుందని కూడా తెలుసు.

ఈరోజు కరణ్ జోహార్ తీస్తున్న ఏ జవానీ హై దివానీ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ లో దీపికా పదుకొణే అన్న మాటలవి.  చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి చివరకు మా ఇద్దరీ కెమిస్ట్రీ కలుస్తుందని తెలుసుకున్న తర్వాతనే ఈ సినిమాకి ఒప్పుకున్నామని చెప్తోంది దీపిక.  

2008 లో దాదాపూ ఐదు సంవత్సరాల క్రితం బచనా ఏ హసీనో లో కలిసి చేసిన రణబీర్ దీపికాలు మరోసారి ఈ సినిమా కోసం దగ్గరయ్యారట.  అంతేకాదు, అప్పట్లో అయిన పరిచయం వలన ఇప్పటికీ రణబీర్ తాను ఇతరులతో మాట్లడటం సహించడంటూ ఎంతో గర్వంగా చెప్తోంది దీపిక.  ఇదంతా మీడియాకు మసాలా చేర్చటానికి ఉపాయమే.  

డబ్బులున్నవాళ్ళకి వేడుక చేసుకోవటానికో వంక కావాలన్నట్టు, సినిమా ప్రచారానికి అంతకు ముందు లేనంత ప్రచారం అవసరం పడుతోంది కాబట్టి ఏదో ఒక వంకతో నలుగురూ మాట్లాడుకునేట్టుగా చేసుకోవటమే లక్ష్యమైపోతోంది.  ఫస్ట్ లుక్, టీజర్, లోగో ఆవిష్కరణ, ఆడియో ఆవిష్కరణ, టివిల్లో వివిధ కార్యక్రమాల్లో స్పాన్సర్ చేస్తూ నటీనటులు, దర్శకులు పాల్గొనటం, ఇలాంటివన్నీ సినిమారంగంలో ఆధునిక పోకడలు.  నటీనటులకు ఇచ్చే పారితోషికంలో ప్రత్యేకంగా సినిమా ప్రోమో కోసం కూడా వాళ్ళు నటించటానికి కూడా మిళితమైవుంటుంది.  సినిమా విడుదలైన తర్వాత కూడా విజయ యాత్రలంటూ ఎన్నో రకాల ప్రచార విధానాలు వచ్చాయి.  ఎంతో పెట్టుబడి పెట్టి తీసే సినిమాలకు ఈ ప్రచారాలు లేకపోతే పెట్టిన డబ్బులు కూడా తిరిగిరావని వాళ్ళ భయం.  అవన్నీ కలిపే సినిమా నిర్మాణ వ్యయం అవుతుందని వారి లెక్కలు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sadak bundh and taking it personal
Governor narasimhan visit on revenue meetings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more