Tanikella bharani drama festival

tanikella bharani, indian stage plays, cinema, tv serials, drama festival

tanikella bharani drama festival

tanikella-bharani.png

Posted: 03/13/2013 04:57 PM IST
Tanikella bharani drama festival

tanikella-actor

తనికెళ్ళ భరణి!  ఒక విలక్షణమైన కళాకారుడు.  రచనా వ్యాసంగంలోనూ, సినీ కళాకారునిగానూ, లఘు చిత్రాల నిర్మాతగానే కాకుండా తాజాగా గాయకుడు బాల సుబ్రహ్మణ్యం, నటి లక్ష్మి లతో ప్రయోగాత్మక మిధునం చిత్ర శిల్పిగా తనికెళ్ళ భరణి తనలోని కళాత్మక విశిష్టతను చాటుకున్నారు.  అద్భుతమైన గాత్రంతో సంభాషణలను పాత్రోచితంగా వైవిధ్యంతో పలికించటమే కాకుండా గానార్చనతో తన శివభక్తిని చాటుకున్నారాయన.  

1985 లో లేడీస్ టైలర్ తో సినిమారంగంలో అడుగుపెట్టిన తనికెళ్ళ భరణి 1989లో శివ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2013 లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు తెలుగు సినిమాల్లో 180 పైగా చిత్రాల్లో హాస్య, దుష్ట అలా వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు భరణి

short-film

భరణి రాసిన నాటికలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి.  ఈ నెల 14, 15 తేదీల్లో హైద్రాబాద్ రవీంద్రభారతిలో జరుగనున్న తనికెళ్ళ భరణి నాటకోత్సవాలలో ఆ నాటికలను మరోసారి వీక్షించే అవకాశం నాటక ప్రియులకు కలుగుతోంది.  సంగమం, కనకధార సంస్థలు సంయుక్తంగా సంగమం-రంగస్థల సంబరం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాష్ట్రంలో మంచి మంచి నాటక ప్రదర్శనలు జరగాలంటే వాటిని టికెట్ కొని చూస్తే ప్రేక్షకులుంటేనే సాధ్యపడుతుందని తనికెళ్ళ భరణి అన్నారు.

tanikella

అదీ నిజమే.  ఏ కార్యక్రమమైనా ఆర్థిక వనరులు లేకుండా జరగటం కుదరని పని.  ఒకసారి జరిగినా కొనసాగటం జరగదు.  సినిమాలు, టివి కార్యక్రమాలకు లాగా వీటికి స్పాన్సర్లా దొరకరు.  మరి వాటిని పోషించవలసింది కళా ప్రేమికులే.  ఈ విషయంలో మహారాష్ట్ర అప్పటికీ ఎప్పటికీ ముందంజలోనే ఉంది.  అక్కడ సినిమా రంగంలో ప్రవేశించినవారిలో పేరు తెచ్చుకున్నవారు ఒకప్పుడు రంగస్థలం మీద పనిచేసినవారవటమే కాదు, సినిమాలలోకి వచ్చిన తర్వాత కూడా రంగస్థలం మీద నటించాలనే కోరికతో కళా సేవ చేసినవారున్నారు.  అది మన రాష్ట్రంలో లేదు.  అంతే కాదు, నాటకాలంటే మనకి చులకనే.  ఆ, అంతా నాటకం అనే మాటే దానికి తార్కాణం.  

టివి సీరియల్స్ లో కుటుంబాలలో అంతర్గత కలహాలు, చాలా సార్లు చచ్చిపోయి మళ్ళీ బ్రతికిన పాత్రలు ఇలాంటివి వస్తున్న సందర్భంలో చిన్మయ మిషన్ వారి సీరియల్ ఉపనిషత్ గంగ లో నాటక ఫక్కీలో చిత్రీకరించటం విశేషం

chinmaya

సినిమాల్లో లాగా టేక్ లు ఉండని నాటక రంగం మీద రాణించిన వారే గొప్ప కళాకారులు.  ఒక సారి తప్పు పడిందంటే దాన్ని సవరించుకునే అవకాశం ఉండదు కాబట్టి రంగస్థలం మీద నటులు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసివుంటుంది.  అందుకే థియేటర్ ఆర్ట్ కున్న గొప్పతనం దానికుంది.  కానీ మన రాష్ట్రంలోనే ఆధునిక పోకడలకు పోతున్నామనుకుని నాటక రంగాన్ని ఆదరించటం లేదు.  కళాకారులు కూడా సరిపడినంత పారితోషికం లేకుండా ఎంత కాలం చెయ్యగలరు.  ఆర్థిక స్తోమతు లేని కారణంగా నాటక రంగం చులకన భావనలో పడి అణిగిపోయింది.  కోట్లల్లో ఖర్చుపెట్టి పెద్ద పెద్ద సెట్టింగ్స్, ఖరీదైన పోరాట దృశ్యాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఔట్ డోర్ చిత్రీకరణతో, యువతను ఉర్రూతలూగించే సౌందర్య, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సినిమా ముందు నాటకరంగం చిన్న నలుసైపోయింది.  

అందువలన ఒకప్పుడు ఎంతో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన సురభి నాటక సంస్థలు కూడా కాలం తీరటానికి సిద్ధంగా కొనవూపిరితో వున్నాయి.  రష్యా, అమెరికా, బ్రిటన్, ఇంకా ఎన్నో యూరోపియన్ దేశాలలో ఇప్పటికీ రంగస్థల ప్రదర్శన జరుగుతోందంటే అక్కడ వాటికున్న ఆదరణే అందుకు కారణం.  

అంతా బావుంది.  సంగమం-రంగస్థల సంబరం 2013 అనే చక్కటి కార్యక్రమానికి పూనుకున్నారు.  శంకరాభరణం సినిమాలో అన్నట్టుగా కళకు ఒక కాపు కాయటానికి సిద్ధమయ్యారు.  కానీ చివర్లో అన్న మాటలే కాస్త కలుక్కుమన్నాయి.  ఈ ప్రదర్శనలకు సినిమా రంగ ప్రముఖులు పాల్గొంటున్నారు అని చెప్పారు.  అదే కాస్త బాగనిపించలేదు.  నాటకాన్ని నాటకంలా చూడాలి కాని దానికి మళ్ళీ సినిమా తళుకులా అనిపించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vatican bishop speech telugu translation
Bellary rejects sriramulu bsr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more