Shivaratri specialty and shiva philosophy

shivaratri, shiva, lord shiva, parvathi, hindu gods

shivaratri specialty and shiva philosophy

shiva-ratri.png

Posted: 03/10/2013 10:09 AM IST
Shivaratri specialty and shiva philosophy

lord-shiva

ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి.  శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలలో ఈ రోజంతా ఒకరినొకరు శివా అనే పిలుచుకోవటం జరుగుతుంది.  అన్ని సౌకర్యాలనూ వదులుకుని జనసంద్రంలో తాము కూడా కలిసిపోయి తమ ప్రత్యేకతను మర్చి పోయి, అందరితో పాటు శివదర్శనం కోసం బారులు తీర్చి తమ వంతు కోసం ఓపికగా వేచి చూడటమనేది అహాన్ని విడనాడి సర్వం సమర్పిస్తూ దైవంలో ఐక్యమవటానికి సర్వజీవులూ చేసే జీవన ప్రయాణానికి సూచిక.  ఈరోజు అర్ధరాత్రి జరిగే శివపార్వతుల కళ్యాణం సృష్టి ప్రారంభానికి సంకేతం.  

tandavaశివం అంటేనే ఆనందం.  ఆనంద హేళలో నృత్యం చేసేవాడే శివుడు.   ప్రేమ, త్యాగనిరతి శివ తత్వాలు.  తన భక్తులకోసం కైలాసాన్ని దిగివచ్చి వరాలిచ్చి, భోళా శంకరుడిగా పేరుగాంచాడు.   లోకకళ్యాణం కోసం హాలాహలాన్ని తానే మింగి, అది కడుపులోకి వెళ్లి లోకాలను నాశనం చెయ్యకుండా ఉండటం కోసం గొంతులోనే నిలిపి ఉంచి నీలకంఠుడయ్యాడు.  స్త్రీలకు సమాన హక్కు అంటూ ఇప్పుడు అందరూ నినదిస్తున్నారు కానీ, అర్ధనారీశ్వర తత్వంలో ఆ విషయాన్ని ఎప్పుడో ప్రభోదించాడు శివుడు.   అంతేకాదు, కలిసి నృత్యం చెయ్యటమే కాక, శివపార్వతుల సంవాదం రూపంలో ఎన్నో ఆధ్యాత్మిక చర్చలు చేసారు పార్వతీ పరమేశ్వరులు.  ardhanari

నటరాజస్వామిగా కేవలం ఆనందంతో నృత్యం చెయ్యటమే కాదు, కోపంతో ప్రళయతాండవం చెయ్యటం కాదు,  జగన్నాటకంలో తన పాత్రను ఔచిత్యంతో పోషించే విధానం కూడా ఉంది కాబట్టే నాటక రంగంలో ఉన్నవారికి నటరాజస్వామి ఆరాధ్యదైవం.  నిరాడంబరంగా జీవించే విధానాన్ని చూపించిన శివదేవుని కథ అందరికీ ఆదర్శప్రాయం.

ఏ ఆలయంలో ఏ రూపంలో ఉన్నాడు, ఎంత ఎత్తులో ఉన్నాడు, స్థల పురాణం ఏం చెప్తుంది అన్నది పక్కన పెట్టి, వీలయిన చోట శివదర్శనం చేసుకుని, దానికంటే ముఖ్యంగా శివ భక్తులంతా ఈ రోజు నిష్టగా ఉపవాసముండి, రాత్రికి జాగరణ చేస్తారు.

జాగరణ అంటే జాగరూకత.  నిద్రపోయే సమయంలో కాకుండా మనం ఎంత వరకూ ఎరుకలో ఉన్నామని చూసుకుంటే చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాము.  చాలా వరకు పనులను యాంత్రికంగా చేస్తూ ఉంటాము.  జాగరణ పేరుతో రాత్రంతా ఏదో వ్యాపకంతో గడిపేవారుంటారు.  తీర్థస్థలాల్లో భక్తులను నిద్రాదేవి ఆవహించకుండా ఉండటం కోసం భజనలు, ఇతర ఆధ్యాత్మిక, సాహిత్య కళా కార్యక్రమాలు జరుపుతుంటారు.  ఇక కొందరు ఇళ్ళల్లో ఉండి టివిలు చూసుకుంటూ, ఏదైనా ఆడుతూ, పాడుతూ రాత్రంతా నిద్రపోకుండా గడుపుతారు.  అయినా వాటికి అభ్యంతారు ఎవరూ చెప్పలేదు.  ఎందుకంటే, జాగరణ చెయ్యటమే ముఖ్యం కాబట్టి.  శివభక్తిలో చెయ్యటం అనేది ప్రధానం.  అంటే కర్మాచరణ.  

nataraja-swamyఅందుకే, తెలిసోతెలియకో చేసిన పనులకు కూడా ముక్తి కలిగుతుందని చెప్తారు.  తనకోసం దీపం వెలిగించినా, ఆ వెలిగించింది ఆలయమైతే అప్పుడూ ఆ పుణ్య ఫలం దక్కుతుందనే చెప్తారు.  అలాగే ఏ పనిలో ఉండైనా సరే జాగరణ చేసినట్లయితే అది  కూడా శివార్చనలో భాగమైన శివరాత్రి జాగరణ కిందికే వస్తుంది.

poisonపాశ్చాత్య విధాన ప్రలోభంలో పడి విలాసవంతమైన జీవితమే జీవితమని, దాని సాధనే జీవిత లక్ష్యమని నమ్మేవారికి శివకథలు కనువిప్పు కలిగిస్తాయి, మార్గదర్శనం చేస్తాయి.  నిరాడంబర జీవనం, కోరికలను అదుపులో పెట్టుకోవటం, నిత్యం యోగసాధన చేయటం, జీవిత భాగస్వామికి సమాన హోదాను కలిగించటం, సర్వజీవులతో సఖ్యంగా ఉండటం అందరికీ మంచి కలగటం కోసం ఎంతటి త్యాగాన్నైనా చెయ్యటం, ఆపదలలో ఉన్నవారికోసం ఎంత కిందికైనా దిగివచ్చి ఆదుకోవటం ఇవన్నీ శివతత్త్వంలో మనం చూస్తాం.  అటువంటి శివుని ఆరాధించటం ముందు తంతులను యాంత్రికంగా చెయ్యటంతో ప్రారంభించినా చివరకు, అంటే ఆత్మ పరిణితి కలిగే సమయానికి పూర్తిగా శివతత్వంలోకి పరివర్తన చెందటం జరుగుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political rivalry leads to impeachment attempts
Sr ntr sridevi selected as greatest indian actors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more