Sr ntr sridevi selected as greatest indian actors

cnn ibn poll, greatest indian actor of all time, greatest indian actress of all time, ntr greatest actor, sridevi greatest actor

News channel CNN-IBN has conducted a survey poll to find out the greatest Indian actor of all time.

Sr NTR-Sridevi selected as greatest Indian Actors.png

Posted: 03/09/2013 12:40 PM IST
Sr ntr sridevi selected as greatest indian actors

sr.ntr sridevi

భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో  విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ను దేశ సినీ జగత్తులోకెల్లా అత్యుత్తమ నటుడిగా ఎంపిక చేసుకున్నారు. తన నట విశ్వరూపంతో రక్తికట్టిస్తూ అశేష ప్రేక్షక జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు. ఈ సర్వేలో ఆయన భారతదేశంలోనే అత్యధిక జనాధరణ కలిగిన ఏకైక నటుడిగా ఎంపికవ్వడం తెలుగు జాతికే గౌరవప్రదంగా చెప్పవచ్చు. ఈ వందేళ్ళ సినీ చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప నటులు ఉన్నా అత్యథిక మంది ఎన్టీఆర్ నే ఎవర్ గ్రీన్ హీరోగా ఎన్నుకున్నారు. దిలీప్ కుమార్, ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, రాజ్‌కుమార్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, బాల్‌రాజ్ సాహ్ని, గురుదత్, ఓంపురి, నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి, సౌమిత్రో చటోపాధ్యాయ్, సంజీవ్ కుమార్, ఉత్పల్ దత్, చబ్బీ బిశ్వాస్ వంటి దిగ్గజ నటులు పోటీలో ఉన్నా 53 శాతం ఓట్లతో ఎన్‌టీఆర్‌కే పట్టం కట్టారు. 44 శాతం ఓట్లతో కమల్‌హాసన్ రెండో స్థానంలో నిలిచారు. మలయాళ నటుడు మోహన్‌లాల్, దివంగత కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ మూడో స్థానంలో (ఒక శాతం) నిలిచారు. ఇతరులు ఒక శాతం ఓట్లు కూడా సాధించలేకపోయారు.

ఇక సుందరాంగుల విషయానికి వస్తే... అత్యుత్తమ హీరోయిన్ గా అందాల సుందరి శ్రీదేవికి పట్టం కట్టారు. అతిలోక సుందరిగా యువతకు గిలిగింతలుపెట్టి...నటనాకౌశలంతో అందరి ప్రశంసలు పొంది...తారాపథంలో అగ్రస్థానానికి ఎదిగి...వన్నె తరగని అందంతో మళ్లీ కనువిందు చేస్తున్న శ్రీదేవికే నెటిజళ్ళ ఓట్లు పడ్డాయి. మహానటి సావిత్రి, మధుబాల, మాధురి దీక్షిత్, ఐశ్వర్యారాయ్‌లను పక్కనబెట్టి అతిలోక సుందరివైపే మొగ్గుచూపారు. వందేళ్ల సినీ చరిత్రలో అత్యంత గొప్ప నటిగా శ్రీదేవికే 39 శాతం మంది ఓటేశారు. మాధురీదీక్షిత్ రెండో స్థానంలో (16 శాతం ఓట్లు), మహానటి సావిత్రి మూడో స్థానంలో (12 శాతం), ఐశ్వర్యారాయ్ నాలుగో స్థానంలో (8 శాతం) నిలిచారు.

ఈ వందేళ్ల సినీ చరిత్రలో ఇక ఉత్తమ చిత్రంగా కమల్ హాసన్ నటించిన నాయకన్ కు మొదటి స్థానం కట్టబెట్టారు. ఈ సినిమాకు 42 శాతం ఓట్లు లభించాయి. ఒకప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసిన షోలే సినిమా 29 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. 'స్వయంవరం' చిత్రానికి 6 శాతం, 'మొఘల్ ఎ ఆజామ్', 'పథేర్ పాంచాలి' చిత్రాలకు 5 శాతం ఓట్లు లభించాయి.

legennds india

ఇక దర్శకత్వ విభాగంలో లెజెండ్ డైరెక్టర్ అయిన మణిరత్నానికి పట్టం కట్టారు. అత్యుత్తమ దర్శకుడిగా మణిరత్నం 29 శాతం ఓట్లతో నిలిచారు. సామాజిక ఇతివృత్తం నేపథ్యంగా ఎక్కువ చిత్రాలు తెరకెక్కించిన కె. బాలచందర్ (18 శాతం ఓట్లు), దేశ సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సత్యజిత్ రే (14 శాతం ఓట్లు), తమిళ దర్శకుడు శంకర్ (9 శాతం ఓట్లు) పొందారు.

భారతదేశపు ఉత్తమ సంగీత మ్యూటిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ని 49 శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో నిలిపారు. దేశానికి ఎంతో గర్వకారణం అయిన ఆస్కార్ అవార్డ్ గ్రహీత, సంగీత దర్శకుడు అయిన ఎ.ఆర్.రెహమాన్ 29 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమవడం గమనార్హం. నేపథ్య గాయకుడిగా ఎంతో పేరుప్రఖ్యాతలు పొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడిగా మాత్రం 7 శాతం ఓట్లే పొందగా బాలీవుడ్ సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్ 4 శాతం ఓట్లు పొందారు.

మొత్తంగా చూస్తే ఎంతో మంది ఉద్దండులు, లెజెండ్ లు ఉన్నా, వారందరిని ప్రక్కకు నెట్టి, దక్షిణాది నటులకు పట్టకట్టారంటే మన ఘనత ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shivaratri specialty and shiva philosophy
Indian based dibon solutions visa fraud  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more