ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మీద వేసిన పిటిషన్లన్నీ వమ్మయ్యాయి. గోదావరీ నదీ జలాల వాడకంలో మహారాష్ట్ర తమ హక్కులను అధిగమించిందని రాష్ట్రం చేసిన ఆరోపణలన్నిటినీ భారత దేశపు అత్యుత్తమ న్యాయస్థానం కొట్టివేసింది.
పిటిషన్లు వేసారు దాన్ని గంభీరంగా తీసుకుని కేసు తయారు చెయ్యకపోవటంతో కేసులన్నీ నీరుగారి మహారాష్ట్ర పక్షంలో నిర్ణయం వచ్చిందని ప్రతిపక్షాలు ఎలుగెత్తుతున్నాయి. పిటిషన్లలో ఆంధ్రప్రదేశ్ కోరుతున్నవాటిని దేన్నీ పొందే హక్కు లేదంటూ ధర్మాసనం ప్రకటించింది. బాబ్లీ మీద నిషేధం విధించేంత అక్కడ ఏదో జరుగుతున్నట్టుగా రాష్ట్రం తమ పిటిషన్లను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రభావితం చెయ్యలేకపోయింది. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేసిన విన్నపాన్ని ధర్మాసనం కొట్టివేసింది. 1975 లో జరిగిన ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర గోదావరీ నదీ జలాలను 60 టిఎమ్ సిల వరకూ వాడుకోవచ్చని తేల్చింది.
ఒక రాష్ట్రం మరో రాష్ట్రం మీద వేసిన దావాలో నేరాన్ని నిరూపించ వలసిన బాధ్యత (ఓనస్) ఫిర్యాదు చేసిన వారిమీద ఉంటుంది. దాన్ని ఎత్తిచూపించవలసిన పని ఫిర్యాదు చేసిన రాష్ట్రానిదే అంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను బట్టి రాష్ట్రం తరఫునుంచి పసలేని వాదనలను వినిపించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.
అసలు ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలనే సరిగ్గా చదివినట్టు లేరు. పోచంపాడు డ్యాం స్థలం వరకూ 60 టిఎమ్ సిల నీటిని మహారాష్ట్ర వాడుకోవచ్చని ఒప్పందంలో ఉన్నప్పుడు, ముంపు ప్రాంతంలో నిర్మాణం జరుగుతోందన్న ఆంధ్రప్రదేశ్ వాదనలో పట్టు లేకుండా పోయింది.
మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ లో ఒప్పందం ప్రకారం కేవలం 2.74 టిఎమ్ సి ల జలాలనే నిల్వ చేస్తామని మహారాష్ట్ర హామీ ఇస్తోంది. అయితే అంతకు మించి నీటిని వాడుకున్నారని రాష్ట్రం చేసిన ఆరోపణ కూడా నీరుకారిపోయింది. నవంబర్ నెల తర్వాత వర్షాభావం వలన గోదావరిలో కేవలం 2.64 టిఎమ్ సి ల నీరు మాత్రమే ఉన్నదని కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక తెలియజేస్తోంది. దానితో పోచంపాడు రిజర్వాయర్ నుంచి మహారాష్ట్ర నీటిని తీసేసుకుంటోందని, దానివలన తెలంగాణాలో తాగు నీరు, సాగు నీరు లేకుండా పోతుందని రాష్ట్రం ఆవేదనతో చేసిన ఆరోపణ కూడా ఫలితాన్నివ్వలేదు. ఆంధ్రప్రదేశ్ కి ఏదో తీవ్రమైన నష్టం జరుగుతున్నదని ధర్మాసనం అభిప్రాయపడలేదు.
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్ట్ లాగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి, విశాల హృదయంతో సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ, ఆంధ్ర ప్రదేశ కఠినమైన ధోరణిని అవలంబించటం తగదని ధర్మాసనం మొట్టికాయలు వేసింది.
గతంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద ఆందోళన చేపట్టి తనతో పాటుగా మహారాష్ట్రలో అడుగుపెట్టిన వారందరితో పాటు పోలీసు అదుపులో జైల్లో గడిపినా ప్రయోజనం లేకపోయింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more