ప్రధానమంత్రి కావేరి పై తీసుకున్న నిర్ణయంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తన పుట్టిన రోజు వేడుకలకు అందిన బహుమతలన్నింటిలో ఇదే అత్యత్తమమైనదని జయలలిత అన్నారు. కావేరీ నదీల జలాల పంపిణీ విధానాన్ని కేంద్రం నోటీసు ఇచ్చిన తరువాత ఆమె తన ఆనందాన్నివ్యక్తం చేశారు. వచ్చే ఆదివారం జరగనున్న జయలలిత పుట్టిన రోజుకు ఇంతకన్నా మంచి బహుమతి వుండబోదని, తమిళనాడు ప్రజల హక్కులు కాపాడబడ్డాయని, కావేరీ డెల్టా రీజియన్ లోని రైతులు సైతం ఎంతో ఆనందపడతారని ఆమె అన్నారు. ఈ అర్డర్లకు కర్నాటక ప్రభుత్వం కట్టుబడి వుండాలని ఆమె కోరారు. కావేరీ నదీ జలాల పంపిణీల పై ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చింది. కావేరీ జల వివాద ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ( తుది తీర్పు) కు గెజిట్ రూపమిచ్చింది. ఈ అంశంలో సర్కారు జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గెజిట్ నోటీఫికేషన్ పై ఈ నెల 20 లోగా నిర్ణయం తీసుకోవాలంటూ, 4 స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో ఆరేళ్ల క్రితం కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డును గెజిట్ లో ప్రకటించింది. ట్రిబ్యునల్ చైర్మన్, జస్టిస్ ఎన్పీ సింగ్, సభ్యులు ఎన్ ఎస్ రావు, సుదీర్ నారాయణ్ 2007 ఫిబ్రవరి కావేరీ జలాల పంపిణీ పై ఏకగ్రీవ తీర్పు వెలువరించారు.
దిగువ కోలెరున్ ఆనకట్ట వద్ద కావేరీ బేసిన్ లో జలాల లభ్యతను 740 టీఎంసీలుగా తేల్చారు. కావేరీ జలాలను నాలుగు రాష్ట్రాలకు పంచుతూ తుది తీర్పు ఇవ్వటం జరిగింది. తమిళనాడుకు 419 టీఎంసీలు ( 562 టీఎంసీలు డిమాండ్ చేశారు) కర్టాటక 270 టీఎంసీలు ( కోరింది 465 టీఎంసీలు) , కేరళ 30 టీఎంసీలు , పుదుచ్చేరికి 7 టీఎంసీల నీటిని పంపిణీ చేశారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకొంటే తమిళనాడుకు 190 టీఎంసీలు విడుదల చెయ్యాలని ట్రిబ్యునల్ పేర్కొంది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల్లోగా ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చినందును కావేరీ రివర్ అథారిటీ ( సీఆర్ ఏ) సీఎంసీ వంటి సంస్థల కాలం తీరినట్టే. కావేరీ పరీవాహక రాష్ట్రాల ప్రతినిధులు, జల వ్యవసాయ నిపుణులతో కూడిన కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ( సీఎంబ) , కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఇక అస్థిత్వంలోకి వస్తాయి. ఈ విషయం పై జయలలిత మాత్రం తమ 22 ఏళ్ల పోరాటం ఫలించిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తుంది. కావేరీ జలాల వివాదానికి తెరదించుతూ నిర్ణయం తీసుకొన్న కేంద్రానికి , ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్ కు , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కురుణానిధిలకు ఆమె క్రుతజ్నతలు తెలిపారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం పై కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్ శేట్టర్ అసంత్రుప్తిగా ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more