కేంద్రహోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సారీ చెప్పాడు. హిందు ఉగ్రవాదంపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బాధపడుతున్నానని షిండే రాత్రి క్షమాపణ కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశానికి ముందు షిండే చేసిన ఈ ప్రకటన భారతీయ జనతాపార్టీని చల్లపరిచింది. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని సాకుగా తీసుకొని దుమారాన్ని రేపాలని అనుకున్న బీజేపి వ్యూహ్యాన్ని షిండే ప్రకటన నీరుగార్చిందని చెప్పవచ్చు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఏ మతానికి ఉగ్రవాద రంగు పులిమేందుకు ప్రయత్నించలేదన్నారు. జైపూర్ లో గత నెల నేను చేసిన ప్రకటన అపోహను స్రుష్టించింది. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క మతానికో ముడిపెట్టానని, ఉగ్రవాద శిభిరాలను నిర్వహించడంలో కొన్ని రాజకీయ సంస్థల ప్రమేయముందని నేను ఆరోపిస్తున్ననని షిండే అన్నారు. అయితే లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో కూడా లోక్ సభాపక్ష నేత , హోం మంత్రి షిండే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ ప్రతిపక్షాలు అడిగిన అన్ని డిమాండ్లకు దాదాపు అంగీకరించారు. అగస్టా కుంభకోణానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ) డిమాండ్ కైనా తాము సిద్దమేనని కమల్ నాథ్ చెప్పారు. అలాగే, హిందు ఉగ్రవాదం వ్యాఖ్యలపై లోక్ సభలో పత్రిపక్ష నేత సుష్మా స్వారాజ్ కు వివరణ ఇచ్చేందుకు ఇదే సమావేశంలో షిండే సంసిద్దత వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను హమీ ఇచ్చిన విధంగా ప్రకటన విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more