Tollywood movies recap of 2012

Mashesh babu Businessman, Dammu, Eega, Gabbar Singh, Julayi, Rachcha, Telugu cinema 2013, year end recap

012, the year which was supposed to be the last year of the mankind (pun intended) is about to end and it is the time to go for a recap and see what were the movies which hit the bull’s eye and entertained us.

Tollywood Movies recap of 2012.png

Posted: 12/29/2012 10:09 AM IST
Tollywood movies recap of 2012

Gabbarsingh

తెలుగు సినీ పరిశ్రమ... సౌత్ లో బాలీవుడ్ తరువాత పెద్ద మార్కెట్ ఉన్న పరిశ్రమ మనదే అని చెప్పవచ్చు. కాలం మారుతున్నా కొద్ది సినిమా రంగంలో ఎన్నో మార్పులు, హంగులు చోటుచేసుకుంటున్నాయి. ఇక 2012 సంవత్సరంలో మన తెలుగు సినిమా పరిశ్రమలో చోటు చేసుకొని కొన్ని పరిణామాలను ఒక్కసారి పరిశీలిద్దాం. కొన్ని విజయాలు, మరికొన్ని పరాజయాలు, కొన్ని చేదు అనుభవాలు.. మొత్తంగా చూస్తే పోయిన ఏడాది 2011 సంవత్సరంతో పోల్చితే తెలుగు పరిశ్రమ పరిస్థితి ఈ సారి ఆశాజనకంగా ఉందనే చెప్పవచ్చు. 2012లోని మెరుపుల్నీ, మరకల్నీ, మైలురాళ్లనీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

ఈ ఏడాది మన తెలుగు సినిమాలు ఇప్పటి వరకు 120 పై చిలుకు చిత్రాలు విడుదల అయ్యాయి. మరి ఎన్ని విజయం సాధించాయి. ఎన్ని రికార్డులు స్రుష్టించాయి, ఎన్ని మంచి చిత్రాలుగా నిలిచాయి అంటే... కేవలం పై 20 చిత్రాలు మాత్రమే విజయం బాట పట్టాయి. మరి అవన్ని స్టార్ హీరోల సినిమాలనే అంటే కాదు... ఇద్దరు ముగ్గరు స్టార్ల సినిమాలు తప్పితే... కొత్తవాళ్ళ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో బాక్సాఫీసు కలెక్షన్ల గురించి చెప్పుకోవాలంటే ముందు వరసలో నిలిచేది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. చాలా విరామం తర్వాత పవన్‌కళ్యాణ్ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా, కలెక్షన్ల వర్షం కురిపించి ముందు వరసలో నిలిచింది. ఇక మంచి క్రియేటివ్ సినిమాగా ప్రేక్షకులు ఆదరించింది అంటే... దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ’ఈగ ’ ‘ఈగ’లాంటి చిన్న ప్రాణితో సినిమా తీసి... ఫైనల్‌గా డెరైక్టరే కింగ్‌మేకర్ అని నిరూపించారు. దక్షిణాదిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ‘ఈగ’ వసూళ్లపరంగా కూడా ఉన్నత స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో అయితే ‘గబ్బర్‌సింగ్’ను కూడా పక్కకు నెట్టి నంబర్‌వన్ గ్రాసర్‌గా నిలిచింది ఇది. మన సినిమాలకు తమిళనాట అంతగా ఆదరణ దక్కని పరిస్థితుల్లో కూడా ‘ఈగ’ అక్కడ విజయపతాకం ఎగురవేయగలిగింది. ‘ఈగ’ సినిమా పరంగానే కాకుండా 2012 రాజమౌళికి మరచిపోలేని సంవత్సరం.

2012_good_movies

ఇక మంచి విజయాలు సాధించిన సినిమాల విషయానికి వస్తే... ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘బిజినెస్‌మేన్ ’ చిత్రం మహేష్ కి మంచి విజయాన్ని సాధించి పెట్టింది. రామ్‌చరణ్ చేసిన ‘రచ్చ’ భారీ వసూళ్లనే రాబట్టగలిగింది. ఒక కమేడియన్ నుండి హీరోగా మారి మంచి పేరు సంపాదించుకున్న సునీల్ కి ‘పూల రంగడు ’ సినిమా మంచి విజయం సాధించింది. ‘ఇష్క్’ నితిన్‌కి కొత్త జోష్ ఇచ్చింది. ఈ విజయం ఆయనకు కొంగొత్త టానిక్‌లా పనిచేసింది. రామ్‌గోపాల్‌వర్మ ప్రయోగం చేసి విఫలమైన 5డి కెమెరాతో మారుతి తీసిన ‘ఈ రోజుల్లో’ కొత్త ట్రెండ్‌కి నాంది పలికింది. సాయికుమార్ తనయుడు ఆది రెండో సినిమాగా వచ్చిన ‘లవ్‌లీ ’ ఫర్వాలేదనిపించుకుంది. రాజేంద్రప్రసాద్ బడిపంతులుగా నటించిన ‘ఓనమాలు’ తెలుగు సినిమాల్లోని ఉత్తమ విలువలకు దర్పణం పట్టింది. దర్శకుడు క్రాంతిమాధవ్‌కు పేరొచ్చింది. త్రివిక్రమ్ మ్యాజిక్‌పై అల్లు అర్జున్ పెట్టుకున్న నమ్మకాన్ని ‘జులాయి’ నిలబెట్టింది. శేఖర్ కమ్ముల అంతా కొత్తవాళ్లతో చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కొంతవరకూ బ్యూటిఫుల్ అనిపించుకోగలిగింది. నాగార్జున సాయిబాబాగా నటించిన ‘శిరిడిసాయి’, సోషియో ఫాంటసీ ‘ఢమరుకం’ అభిమానుల్ని రంజింపజేశాయి. జనార్థన మహర్షి ‘దేవస్థానం’, తనికెళ్ల భరణి ‘మిథునం’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ‘కృష్ణం వందే జగద్గురుమ్ ’ మంచి సినిమా జాబితాలో నిలిచింది. ఇప్పుడిప్పుడే మంచి దర్శకుడిగా మారుతున్న  మారుతి  ‘బస్‌స్టాప్ ’ మార్క్  సినిమాగా నిలిచి బాగానే వసూళ్లు రాబట్టిందిఇక

ఈ సంవత్సరం పరభాష నుండి మన తెలుగులోకి అనువాదం అయిన సినిమాలకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఎప్పడు మంచి మార్కెట్ తో కలెక్షన్లు కొల్లగొట్టే డబ్బింగ్ సినిమాలకు ఈ సారి కలిసి రాలేదు. సూర్య, కార్తి, విక్రమ్, విజయ్, ధనుష్‌లాంటి అగ్రతారల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. హాలీవుడ్, బాలీవుడ్, తమిళ, కన్నడ, మలయాళ అనువాదాలన్నీ కలుపుకుంటే సుమారు 100 వరకూ తెలుగులో విడుదలయ్యాయి. వీటిల్లో ఏదీ కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని మూటకట్టుకోలేకపోయింది. చివరకు శంకర్ కూడా తెలుగులో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ‘త్రీ ఇడియట్స్’కు రీమేక్‌గా చేసిన ‘స్నేహితుడు’ ఏమాత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దేవి సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ హిందీలో సూపర్ హిట్ అయినా, తెలుగులో ఎందుకనో నిరాశ పరిచింది.

Tollywood_movies

ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంమన తెలుగు పరిశ్రమలో సినిమాల పై వివాదాలు మాత్రం మరచిపోలేని రేంజ్ లో చెలరేగాయి. కొన్ని సినిమాలు టైటిళ్ళ విషయంలో వివాదాలు చెలరేగితే... మరికొన్ని సినిమాలు ఆ సినిమాలోని సీన్స్ ద్వారా పెద్ద దుమారాన్ని రేపాయి. పూరీ జగన్నాథ్ తీసిన ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు ’ సినిమాలో తెలంగాణ వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ వివాదం చెలరేగింది. దీంతో కొన్ని సీన్లు కత్తిరించినా వసూళ్ళ పరంగా బాగానే రాణించింది. ఇక ముఖ్యంగా టైటిళ్ళ విషయంలో ‘ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం’ మరో తరహా వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఈ సినిమా ఉందని, వెంటనే దానిని నిషేధించాలని బ్రాహ్మణ సంఘాలు కన్నెర్రజేశాయి. ఈ సినిమా విషయంలోనూ ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాదాపుగా ఇలాంటి వివాదమే ‘దేనికైనా రెడీ’ని కూడా చుట్టుముట్టింది. ఈ సినిమాలోని కొన్ని పాత్రలు, వాటి తీరుతెన్నులు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు పెట్టాయి. చివరకు ఈ సినిమా వ్యవహారం కోర్టు కేసుల వరకూ వెళ్లింది. ‘సారీ టీచర్’ సినిమా కూడా కొన్ని రోజులు వివాదాల వేడిలో ఉడికిపోయింది. ఈ జాబితాలో త్రీ, అయ్యారే సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ ఏడాదిలో సినీ పరిశ్రమ పెళ్ళిళ్ళ పరిశ్రమగా మారింది. ఎన్నడూ లేనంతంగా చాలామంది యువ కథానాయకులు, నాయికలు పెళ్లి పీటలు ఎక్కేశారు. రామ్‌చరణ్, ఉదయ్‌కిరణ్, నాని, ఆర్యన్ రాజేష్, జెనీలియా, స్నేహ, పార్వతీమెల్టన్ ఓ ఇంటివారయ్యారు. ఇందులో ఆర్యన్ రాజేష్ మినహా మిగిలిన వారంతా ప్రేమ వివాహాలే చేసుకోవడం విశేషం. ఇక, 11-11-11న పెళ్లి చేసుకున్న మమతా మోహన్‌దాస్... అందరికీ షాక్ ఇస్తూ 12-12-12న విడాకులకు అప్లయ్ చేయడం ఊహించని చేదు సంఘటన. ఇవీ మన తెలుగు సినీ పరిశ్రమ 2012 విశేషాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konijeti rosaiah fire on congress party
K keshava rao comment on all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more