రాష్ట్రంలో మళ్లీ పాత మంటలే మండటానికి సిద్దంగా ఉన్నాయి. ఆ మంటలకు కేంద్రం నుండి ఆజ్యం పోస్తున్నారు. గతంలో జరిగిన నష్టం తలచుకుంటే.. ఈసారి ఎలా ఉంటుందో అర్థమవుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. రాష్ట్ర ప్రజల్లో మళ్లీ టెన్షన్ .... నాయకుల్లో హైటెన్షన్ తెలంగాణపై తేల్చడమో నాన్చడమే జరిగే సీన్. ఈసారి పార్టీలు తీసుకునే స్టాండ్ రాష్ట్ర రాజకీయాలను సరికొత్త పథం వైపు మళ్లించనుంది. ఈనెల 28న అఖిలపక్ష భేటీ ఖరారు కావడం... వేదిక ఖాయం కావడం... ముందే జరిగినా... పార్టీ నుంచి ఎవరొస్తారా? అన్న ఊహాగానాలకూ తెరపడింది. పార్టీ నుంచి ఇద్దరు రావాలంటూ షిండే కార్యాలయం వర్తమానం పంపింది. ఇంతకూ ఈ అఖిలపక్ష భేటీ మర్మమేమిటి? 2010 సీన్ రిపీట్ అవుతుందా? రివర్స్ అవుతుందా? పార్టీకి ఇద్దరిని పిలవడంలో మర్మమేమిటి? అఖిలపక్షం నామమాత్రమేనా? 2010, జనవరి 5 రిపీట్ కాక తప్పదా? పార్టీలు ఈసారైనా ఒకే మాట చెబుతాయా?ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్నలివే. ఎఫ్ డీఐ గండం గట్టెక్కెందుకో.... లేక ఒత్తిడికి తట్టుకోలేక అఖిలపక్షమన్న కేంద్రం మొత్తానికి మాట మీదే నిలబడింది. ఈనెల 28న అఖిలపక్ష భేటీ జరుగుతుందని, అందులో మార్పు లేదన్న షిండే.. వేదిక పార్లమెంట్ నార్త్ బ్లాక్ ను, సమయం ఉదయం 10 గంటలుగా తేల్చేశారు. పనిలో పనిగా... రాష్ట్రం నుంచి 9 గుర్తింపు పొందిన పార్టీలకు అంటే.. కాంగ్రెస్ , టీడీపీ, టీఆర్ఎస్ , బీజేపీ, వైసీపీ, సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా, ఎంఐఎంలకు వర్తమానం పంపింది.
ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను అఖిలపక్ష భేటీకి పంపాలని కేంద్ర హోంశాఖ అనదపు కార్యదర్శి స్కందన్ పేరిట లేఖలు రాసింది. డిసెంబరు 9 ప్రకటన తర్వాత తొలిసారి 2010, జనవరి 5న జరిగిన తొలి అఖిలపక్ష భేటీకి కూడా ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించిన కేంద్రం... ఈసారి అదే పంథాను అనుసరించింది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కరు వస్తేనే పార్టీ స్టాండ్ ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని తెలంగాణవాదులు మొదటి నుంచీ కోరుతున్నా కేంద్రం ఇద్దరిని ఆహ్వానించడం వెనుక ఆంతర్యం తెలియడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తెస్తుందా అన్న అనుమానాలు తొలిచేస్తున్నాయి. ఏమైనా... పార్టీ నుంచి ఇద్దరు అంటే.. ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో నాయకుడు వెళ్లినా... అక్కడ పార్టీ స్టాండ్ ను వివరించడం కంటే కూడా వ్యక్తిగత అభిప్రాయాలనే వివరించే ప్రమాదం లేకపోలేదన్నది మరో అనుమానం. పార్టీల అధినేతలు ఏకవాక్యానికే కట్టుబడి ఉండాలని నిక్కచ్చిగా చెప్పినా... అది జరుగుతుందా? లేక తీర్మానం గాడి తప్పి... మళ్లీ మొదటికి తెస్తుందా? అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.ఈ అఖిలపక్షంపై మరో వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ తెచ్చే అధికారం, ఇచ్చే అధికారం కాంగ్రెస్ ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల అభిప్రాయాలను సేకరించి వాటిని సమీక్షించి పరిశీలించి ఆ తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పడమనేది తప్పించుకునే ధోరణిగానే కనిపిస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో భేటీ తర్వాత కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం మొత్తంగా రాష్ట్ర రాజకీయాలను మరో కీలక మలుపు తిప్పక తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more