రాష్ట్రంలో విస్త్రుత ఏకాభిప్రాయం సాధించుకుండా రాష్ట్ర విజన జరిగితే దేశ ఫెడరల్ వ్యవస్థకే విఘాతం కలుగుతుందని లోక్ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్ పిఎన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమస్యపై కేంద్రం ప్రభుత్వం ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం పై అనుమానాల నీడలు కమ్ముకుంటున్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశంపై కొందరు సభ్యుల అడిగిన పశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ కేంద్ర వైఖరిని వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంత సులువుకాదన్న సంకేతం కేంద్రం మంత్రి ఇచ్చారు. అసలు నిజం చెప్పాలంటే రాష్ట్రాల విభజన దేశ రాజకీయ సమాఖ్య వ్యవస్థకకే ప్రమాదమని ఆర్ పి ఎన్ సింగ్ అంటున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను కొంత మంది రాజకీయ నాయకులు మద్దతు ఇస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్రం ఏకంగా దేశ సమైక్యతో ముడిపెట్టింది. ఈ విషయాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదన్న విషయం తెటతెల్లమవుతోంది. అయితే రాజకీయ ఎత్తుగడల్లో బాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్యకు మసిబూసి మారేడు కాయ చేయాలనే చందంగా ఉందని ఆయన అన్నారు. ఆ ఉద్దేశంతో తోనే కాంగ్రెస్ పార్టీ అఖిల పక్ష సమావేశం పేరుతో ఆంద్రప్రదేశ్ రాజకీయ పార్టీలను మోసం చేస్తుందని ఆర్ పి ఎస్ సింగ్ అన్నారు.
ఇలాంటి పరిణామల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ పై అఖిల పక్ష సమవేశం పెట్టేందుకు సిద్దమవుతున్న సమయంలో అదే శాఖ చెందిన సహాయ మంత్రి తెలంగాణ ప్రజలకు, నాయకులకు నిరూత్సాహం కలిగించే వ్యాఖ్యలు చేయటం విశేషం. తెలంగాణ ఇవ్వడానికి ఇన్ని అవరోధాలు ఉంటే ఆ విషయం చెప్పకుండా అఖిల పక్ష సమావేశం అంటూ ఇంత తంతు నిర్వహించడం దేనికని ఆయన మాటల్లో అర్థమవుతుంది. ఈ నెల 28న నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి సంబంధించిన విధివిధానాలు కూడా అనుమానాలకు తావిచ్చేవిధంగానే ఉందని ఆయన అంటున్నారు. అఖిల పక్ష సమావేశానికి రావాలని ఆహ్వనిస్తూ తొమ్మిది పార్టీలకు లేఖలు పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖలో ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరు సభ్యులు హాజరు కావాలని ఆలేఖలో పేర్కొనడంపై తెలంగాణ వాదుల్లో ఆగ్రహజ్వాలాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క పార్టీ నుంచి రెండు ప్రాంతాలకు చెందిన ఇద్దరు సభ్యులు హాజరై రెండు రకాల వాదనాలు వినిపిస్తే ఏకాభిప్రాయం రాలేదనే సాకుతో తెలంగాణ అంశాన్ని మరింత సాగదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త మోసానికి తెరలేపిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ పట్ల చిత్తశుద్ది లేదని, ఆ పార్టీ సీమాంద్ర పార్టీలతో కుమ్మక్కయి తెలంగాణఱ ప్రజలను , ఆరుదశాభ్దాల ఉద్యమాలను కించపరుస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ, సీపిఐ, తెలుగుదేశం పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత నాయకులు కూడా కేంద్రం తీరుకు నిరసన వ్యక్తం చేశాయి. డిసెంబర్ 28 తరువాత రాష్ట్రం మళ్లీ రావణాకష్టలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more