Actress roja distances from ys jagan

Actress Roja to Quit YSR Congress,Roja to come out of YSR Congress,Roja unhappy with YS Jagan Party YSR Congress, Roja wants to quit YSR Congress

Actress Roja did a lot of hulchul when she joined YSR Congress party and is now heard that she is planning to quit..

Actress roja Distances From YS Jagan.png

Posted: 11/26/2012 06:35 PM IST
Actress roja distances from ys jagan

Roja

ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు అయిన రోజా ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ పార్టీలో ఉన్న రోజా తరువాత ఈ పార్టీలోకి వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా... రోజాకి వైయస్ జగన్ పార్టీ పై కూడా మోజు తీరిందా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసి, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, రెండుసార్లు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన రోజా వైయస్ పై అభిమానంతో జగన్ పార్టీలో చేరి, తెలుగు దేశం పార్టీ పైనా, చిరంజీవి పైనా, ఇంకా రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శల దాడులు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే రోజా ఈమధ్యన బొత్తిగా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఉప ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితులైన నాయకుల్లో ఆమె కూడా ఒకరిగా ముద్రపడ్డారు. కానీ, ఈ మధ్య ఆమె జగన్‌కు దూరమైనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె దూకుడే ఆమెకు రాజకీయ పార్టీల్లో కష్టాలు తెచ్చిపెడుతున్నట్లు భావిస్తున్నారు. ఇతర నాయకులకు ఆమె దూకుడు ప్రమాదంగా పరిణమించడం వల్ల ఆమెకు అంతర్గత ప్రత్యర్థులు పెరుగుతున్నారని, దాంతో పార్టీకి దూరం చేసే ప్రయత్నాలను వారు ముమ్మరం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటి రోజాలాంటి చురుకైన నాయకులు నెగలలేరనే మాట వినిపిస్తోంది. అంటే రోజా ఏ రాజకీయ పార్టీలో ఉండదనే విషయం అర్థం అయిందని, తనలాగ దూకుడు ప్రదర్శిస్తే రాజకీయాల్లో ఉండటం కష్టమే అని అంటున్నారు. మరి రోజా ఇలా వేరే పార్టీలో ఉండే బదలు సొంత పార్టీ పెట్టుకొని తన దూకుడు ప్రజా సమస్యల పై ప్రదర్శిస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi court rejects gali janardhan reddys bail petition in omc case
Ramcharan nayak movie first look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more