Rahul gandhi to head congress coordination panel for 2014 polls

rahul gandhi coordination committee, congress coordination committee 2014 lok sabha polls, ahmed patel, janardan dwivedi, digvijay singh, madhusudan Mistry, jairam ramesh,defence minister a k antony,poll alliances, 2014 lok sabha polls, congress party, rahul gandhi, congress Coordination Committee, national politics

Rahul Gandhi to head Congress coordination panel for 2014 polls

Rahul.gif

Posted: 11/16/2012 11:10 AM IST
Rahul gandhi to head congress coordination panel for 2014 polls

Rahul Gandhi to head Congress coordination panel for 2014 polls

యువ నేత రాహుల్ గాంధీకి సారథ్య పగ్గాలు అప్పగించింది! ఆయన నేతృత్వంలో ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది! ఆ కమిటీకి అనుబంధంగా మరో మూడు ఉప కమిటీలను నియమించింది. వాటి బాధ్యతలను సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్‌లకు అప్పగించింది! తద్వారా, ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమన్నట్లు సంకేతాలు ఇచ్చింది. పార్టీలో 'పెద్ద బాధ్యతలు' చేపట్టాలని నేతల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో, ఇందుకు తాను కూడా రెడీ అని యువనేత రాహుల్‌గాంధీ చేతల్లో చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు రాహుల్‌కు 'పెద్ద బాధ్యత'ను అప్పగించింది. పార్టీలో ఆయన పరిధిని విస్తృతం చేస్తూ రాహుల్ నేతృత్వంలో ఎన్నికల సమన్వయ కమిటీని నియమించింది. తద్వారా, తదుపరి ఎన్నికల్లో పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఆయనేనని చెప్పకనే చెప్పింది.

Rahul Gandhi to head Congress coordination panel for 2014 polls

రాహుల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్ నేతృత్వంలో సమన్వయ కమిటీకి అనుబంధంగా మరో మూడు ఉప కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల ముందు పొత్తులకు సంబంధించి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పొత్తుల కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీ మేనిఫెస్టో, ప్రభుత్వ కార్యక్రమాల అమలు కమిటీకి కూడా ఆంటోనీయే నేతృత్వం వహిస్తారని వివరించారు.ఇక, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు సమాచార, ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. సూరజ్‌కుండ్‌లో జరిగిన సంవాద్ బైఠక్‌లో ప్రకటించినట్లు.. 2014 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ నాలుగు కమిటీలనూ ఏర్పాటు చేశారని వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No change in cm or pcc chief azad
Pawan kalyan and trivikram sarada movie titile  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more