ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో సమావేశమయ్యారు. 22న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వివిధ అంశాలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్న తరుణంలో ప్రధాని ఆమెతో విందు భేటీ జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌యాదవ్, ఆయన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లకు విందు ఇచ్చిన కొద్దిరోజులకే మాయావతిని కూడా ప్రధాని విందుకు ఆహ్వానించడం విశేషం. లోక్‌సభలో ఎస్పీకి 22 మంది సభ్యులు ఉండగా, బీఎస్పీకి 21 మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలు యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతిస్తున్నాయి.యూపీఏ నుంచి తృణ మూల్ కాంగ్రెస్ వైదొలిగిన నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీలను మరింత మచ్చిక చేసుకునే దిశగా మన్మోహన్ సర్కారు ఈ విందు భేటీలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా, ప్రధానితో సమావేశం తర్వాత మాయావతి విలేకరులతో మాట్లాడారు. అయితే ఎఫ్‌డీఐల విషయంలో తమ వైఖరి ఏమిటనే విషయాన్ని మాత్రం సరిగా వెల్లడించలేదు.
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్.. పార్లమెంటు సమావేశాల్లో యూపీఏపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మీ వైఖరి ఏమిటని మాయావతిని ప్రశ్నించగా.. ఆమె సరిగా సమాధానమివ్వలేదు. ప్రధానితో తన విందు సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలన్న బిల్లును త్వరగా ఆమోదించాలని తాము డిమాండ్ చేస్తామని ఆమె వెల్లడించారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మాయావతి కూడా సంకేతాలిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా, ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని మాయావతి హామీ ఇచ్చినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more